టిడిపి మాజీ మంత్రి అఖిల ప్రియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>భూమా అఖిల ప్రియా రాసిన ఒక లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో జరుగుతున్న పనులను నిర్ధాక్షణ్యంగా ఆపివేసిన జగన్మోహన్ రెడ్డి తీరు అతడిని రాయలసీమ ద్రోహిగా నిలబడుతుందని ఆమె పేర్కొన్నారు. హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకొని చంద్రబాబు నాయుడు పులివెందులకు నీరు అందించారని ఆమె అన్నారు. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలను విని రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు.



శ్రీశైలంలో 871 అడుగుల నీట మట్టం ఉన్నా కూడా భూములకు మీరు వదల్లేదని, దాంతో నీటి కొరత ఏర్పడిందని ఆమె చెప్పారు. అలాగే 854 అడుగుల వరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ... కెసిఆర్ కెనాల్ ద్వారా జగన్ ప్రభుత్వం కేవలం 2.30 లక్షల ఎకరాలకు మాత్రమే అందించడం సీమ ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతోందని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడే రాయలసీమ పరిస్థితి ఇంత దీన స్థితిలో ఉంటే.. వేసవికాలంలో తాగునీరు కూడా దొరకక ఆ ప్రాంత ప్రజలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఆమె అన్నారు.



ఇంకా తాను తన లేఖలో జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యాలకు భయపడిపోయిన కియా మోటార్స్ అనుబంధ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి పోయాయని అని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు రెండు వేల కోట్లను కడప స్టీల్ ప్లాంట్ లో కేటాయించారని... కానీ జగన్ మాత్రం ఎందుకు కేటాయించలేదని ఆమె ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓర్వకల్లు విమానాశ్రయం ఏర్పాటు చేస్తే.. వైసిపి ప్రభుత్వం విమానాలు కూడా నడపలేకపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. ఇంకా జగన్ పాలనలో ఏర్పడిన ఎన్నో వైఫల్యాలని కప్పిపుచ్చేందుకు వైసిపి వాళ్ళు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆమె అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: