ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఉచిత పథకాలు దేశ రాజధానికి పాకాయి. గతంలో కేవలం ఒకటి, రెండు ఉచిత పథకాలకే పరిమితమైన హామీలు ప్రస్తుతం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రతీదీ ఉచితంగా ఇస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. ఉచితాల వల్ల ప్రజలు, యువత సోమరిపోతుల్లా తయారు అవుతున్నా.. అధికారం చేజిక్కించుకునేందుకు రాజకీయ నాయకులు వాటిని నమ్ముకోని ఎన్నికల బరిలో దిగుతున్నారు. 

తాజాగా ఢీల్లీ అస్టెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్​ పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. దీందో ఆశ్చర్యకమైన  విషయం ఏమిటంటే ప్రకృతి వనరైన నీటిని కూడా ఢిల్లీ ప్రజలకు ఉచితంగా ఉందించడం. రెండు పార్టీలు కూడా ఈ అంశాన్ని తమ ఎన్నికల  మేనిఫెస్టో పెట్టారు. దీంతో 300 యూనిట్లు విద్యుత్​ను కూడా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించారు. 


మొదట మేనిఫెస్టో  విడుదల చేసిన ఆమ్​ ఆద్మీ పార్టీ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉ,చిత విద్యుత్​, 20 వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. దీనినే కాపీ కొట్టిన కాంగ్రెస్​.. ఓ అడుగు ముందుకేసి రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను, 20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.   ఆటోలు, ఈ-రిక్షాలపై ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆహార భద్రత చట్టం కింద ప్రస్తుతం ఇస్తోన్న బియ్యం, గోధుమలను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. 


అలాగే నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు వరాల జల్లును కురిపించారు. డిగ్రీ (గ్రాడ్యుయేషన్) చదివిన వారికి నిరుద్యోగ భృతిగా నెలకు రూ.5 వేలు, పోస్టు గ్రాడ్యుయేట్ చదివిన వారికి రూ.7,500 ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించడంతోపాటు.. సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా రూ.5 వేలు పెన్షన్ అందిస్తామని తెలిపింది. మహిళలకు ఏడాదికి ఓసారి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తామని కూడా కాంగ్రెస్ మాటిచ్చింది. మహిళలతో 100 ఇందిరా క్యాంటీన్లను నడుపుతామని పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: