ఇటీవల వైయస్సార్సీపి పార్టీకి చెందిన ఎంపీ లావు కృష్ణ దేవరాయలు అమరావతి ప్రాంతంలో దీక్షలో నిరసనలు చేస్తున్న రైతుల దగ్గరికి వెళ్లడం జరిగింది. వాళ్లని పరామర్శించి కచ్చితంగా జగన్ ప్రభుత్వం అమరావతి రైతులకు న్యాయం చేస్తుందని భూములు కోల్పోయిన రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని సంఘీభావం తెలపడం జరిగింది. అయితే ఇటువంటి తరుణంలో తాజాగా వైసీపీ పార్టీకి చెందిన నేతలు అమరావతికి వెళ్లేందుకు కొంతమంది భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళితే ఇటీవల వైయస్సార్సీపి పార్టీకి చెందిన ఎంపీ నందిగామ సురేష్ తన సొంత పని పై నందిగామ చేరుకోగానే అక్కడ టీఎన్ఎస్ఎఫ్ అద్వర్యం లో సురేష్ ని అడ్డుకున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతానికి మద్దతు తెలపాలి అంటూ వినూత్న రీతిలో గులాబీ పూలు చేతికందించి నిరసన తెలిపారు. అంతే కాకుండా అక్కడ కొద్దిగా తోపులాట జరగడంతో ఎంపీ సురేష్ నిరసనకారులపై కొద్దిగా సీరియస్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే తరుణంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రాజధాని అమరావతి భూముల విషయంలో వైసిపి ఎంపీలు మాట్లాడాలని కోరుతున్నారు. కేంద్ర బడ్జెట్ విషయంలోనూ రాష్ట్రానికి మొండిచేయి మిగిలిందని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. ఇంత అన్యాయం జరిగిన కేంద్ర ప్రభుత్వాన్ని వైసీపీ ఎంపీలు ఎందుకు నిలదీయడం లేదని ఏపీ ఎంపీల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు విమర్శిస్తున్నారు.

 

మరోపక్క ఏపీ లో ఉన్న ఇతర పార్టీల నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలని బడ్జెట్ విషయంలో చేసిన అన్యాయాన్ని ప్రశ్నించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు జగన్ పై కేసులు ఉండటంవల్ల కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు చేయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా కేంద్రంపై మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: