ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేయడం జరిగింది. కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా కేటాయించకుండా నిధుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత తగ్గించడం తో పాటు కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన విషయంలో కూడా మొండి చెయ్యి చూపించడంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా కేంద్రం ఏపీ పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో సీరియస్ గా ఉన్నారట.

 

ఇటువంటి తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు...చాలా మంచి బడ్జెట్ అంటూ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సాగు రంగానికి అత్యధిక నిధులు కేటాయించారని పొగుడుతూ విద్యారంగానికి కూడా అత్యధిక నిధులు కేటాయించారని నాకు పర్సనల్ గా కూడా బడ్జెట్ బాగా నచ్చిందని పార్లమెంటులో ఎక్కువ చప్పట్లు కొట్టింది కూడా నేనే అంటూ బహిరంగంగా మీడియా ముందు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. జలజీవన్ మిషన్, మెడికల్ కాలేజీ సీట్లు వంటి విషయాలపై గతంలో మాట్లాడానని అలాంటివన్నిటికీ  యాధృచ్చికంగా ఈబడ్జెట్ లో కేటాయింపులు జరిపారని ఆయన అన్నారు.

 

ఆక్వా రంగ అభివృధ్దికి ఎక్కువ నిధులు కేటాయించారని..నరసాపురం నియోజకవర్గంలో ఆక్వా పరిశ్రమకు ఎంతో ఉపయోగపడుతుందని రఘురామ కృష్ణంరాజు కామెంట్లు చేయడంతో ఏపీ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని రాజేసింది. కేంద్ర బడ్జెట్ పై ఒక పక్క అన్ని పార్టీలు మరియు సొంత పార్టీల నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే ఎంపీ రఘురామకష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు జగన్ దృష్టికి వెళ్లడంతో..గతంలోనూ ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం ప్రవేశపెట్టిన సందర్భంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో తన ఛాంబర్ పిలిపించుకుని మాట్లాడిన జగన్ తాజాగా రఘురామ కృష్ణంరాజు చేసిన కామెంట్లకు ఆయనకు ఫోన్ చేసి జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో మరియు ఏపీ రాజకీయాల్లో టాక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: