దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చుసిన 2020 బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన శనివారం ఉదయం 11 గంటలకు నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. అయితే అలాంటి ఈ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు చాలా అన్యాయం జరిగింది. ఎంత అన్యాయం అంటే కనీసం ఒక పైసా కూడా ఆంధ్ర ప్రదేశ్ పై ఖర్చు పెట్టనంత. 

 

ఇక పోతే.. సామాన్యుల బడ్జెట్ అని చెప్పిన అది సామాన్యుల బడ్జెట్ కాకపోయే.. అంతేకాదు ప్రజలు అందరిని పిచ్చోళ్ళని చేసే.. అంతేకాదు.. ఈ బడ్జెట్ లో.. సారీ సారీ. ఏ బడ్జెట్ లోను రైల్వే జోన్‌ అంశానికి కాస్త కూడా ఊపిరి పోయాక పోయిరి. అంతేకాదు.. ఆంధ్రలో రైల్వేకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది. 

 

ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు రైల్వే మంత్రులు అయినా అదే బతుకు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన వ్యక్తి రైల్వేశాఖ మంత్రి అయినా అదే బతుకు.. ఇప్పుడు కాదు లెండి గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించినా ఆయన ఆంధ్రప్రదేశ్‌ వైపు కన్నెత్తి చూడలేదు. అదే ఉత్తరాది ప్రముఖులు రైల్వే మంత్రులు అయితే వారికీ కావాల్సినన్ని రైళ్లు వారి సొంతం చేసుకుంటారు. 

 

అప్పుడు ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ అంశానికి కాస్త ఉపిరినిచ్చారు. అయితే ఆ రైల్వే జోన్‌ ఇంతవరుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింటే ఒట్టు. సంవత్సరం క్రితమే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ని కేంద్రం ప్రకటించింది. ఈ విషయం తెలియని వారు ఉండరు. 

 

ఎన్నో దశాబ్దాల నుండి ఆంధ్రప్రదేశ్ ఎన్నో కీలకమైన రైలు ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తుంది.. కానీ బడ్జెట్ రావడం లేదు.. అదేంటో అక్కడ రైలు పడుద్ది అని చెప్పిన సరే.. వాటి బడ్జెట్లు ఇవ్వరు.. అసలు కొత్త రాష్ట్రం అయినా ఆంధ్ర ప్రదేశ్ కి కొత్త రైల్వే ప్రాజెక్టులు వస్తే ఉపయోగపడుతుంది అనే ఇంకిత జ్ఞానం కూడా లేదు కేంద్రానికి. ఇంకా అసలు రైల్వే బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ కి ఎప్పుడు వస్తుంది? కొత్త రైల్వే ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: