ఇపుడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న అంశమేదైనా ఉందంటే అది శాసనమండలి రద్దు వ్యవహారమే. మండలిని వీలైనంత తొందరగా కేంద్రప్రభుత్వంతో రద్దు చేయించాలని జగన్మోహన్ రెడ్డి ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. అదే సమయంలో ఎంత అవకాశం ఉంటే అంతా వాయిదా వేయించాలని చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన రెండు కీలక బిల్లుల విషయంలో శాసనమండలిలో ఛైర్మన్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు, యనమల ఆడిన తొండాట ఫలితమే ఇపుడు మండలి తీర్మానం.

 

అధికారపార్టీ అసెంబ్లీలో చేస్తున్న తీర్మానాలను శాసనమండలిలో మెజారిటి ఉందన్న ఏకైక కారణంతో  చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్షమన్న తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం చెప్పచ్చు లేకపోతే తిరస్కరించచ్చు. అలాగే అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుల విషయంలో కూడా ప్రతిపక్షం తనిష్టం వచ్చిన స్టాండ్ తీసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టటం లేదు.

 

కాకపోతే అసెంబ్లీలో బిల్లులకు మద్దతిచ్చిన ప్రతిపక్షం మండలిలో మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే విచిత్రంగా ఉంది. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టటాన్ని మొదట్లో వ్యతిరేకించిన చంద్రబాబు తర్వాత యూ టర్న్ తీసుకుని మద్దతిచ్చారు. కానీ అదే బిల్లును మండలిలో తీవ్రంగా వ్యతిరేకించారు.  అలాగే ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమీషన్ల విషయంలో కూడా చేశారు. తాజాగా మూడు రాజధానుల విషయం, సిఆర్డీఏ చట్టం రద్దు విషయంలో కూడా వ్యవహరించారు.

 

శాసనమండలి ఛైర్మన్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు, యనమల తొండాటాడిన ఫలితమే మండలి రద్దు తీర్మానం దాకా వెళ్ళింది. మండలిని రద్దు చేయాలని జగన్ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల వైసిపికీ కొంత నష్టం జరిగినా దాన్ని వేరే రకంగా భర్తీ చేసే అవకాశం కూడా ఉంది. ఇక టిడిపి విషయం చూస్తే చంద్రబాబుకు బాగా నష్టం. ఒక్కసారిగా 34 మండి నేతలు మాజీలైపోతారు. అందుకనే ఎలాగైనా మండలి రద్దు కాకుండా అడ్డుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.

 

ఇందులో భాగమే పార్టీకి చెందిన 34 మంది సభ్యుల్లో 20 మందిని తానే బిజెపిలోకి పంపుతాననే ప్రతిపాదన కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.  చంద్రబాబు రాజకీయం తెలిసిన వాళ్ళు ప్రచారం విషయంలో ఆశ్చర్యపోవటం లేదు. చంద్రబాబు తక్షణ కర్తవ్యం కొడుకు పదవిని రిక్షించటమే అని అందరికీ తెలిసిందే. అందుకనే ఢిల్లీ స్ధాయిలో తనకున్న పరిచాయాలన్నింటినీ ఉపయోగిస్తున్నారట. మరి  ఈ విషయంలో జగన్, చంద్రబాబులో ఎవరిది పై చేయో తొందరలోనే తేలిపోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: