రాజధాని రైతులకు కేంద్రప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అమరావతి పరిధిలోని గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనపై జరుగుతున్న ఆందోళనలు నీరసించిపోయిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఆందోళనలు నీరసించిపోయాయో వెంటనే కొందరు రైతులను తెలుగుదేశంపార్టీ ఢిల్లీకి పంపించింది. ఢిల్లీలో రెండు రోజులు మకాం వేసిన రైతులు, కొందరు టిడిపి నేతలు కలిసి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు.

 

అంటే మూడు రాజధానుల కాన్సెప్ట్ పై గతంలోనే కిషన్ రెడ్డి తన ఆలోచనలను జనాల ముందుంచిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా మళ్ళీ కిషన్ రైతులతో అదే విషయాన్ని చెప్పారు. రైతులు చెప్పిందంతా విన్న కిషన్ రాజధాని మార్పుపై జగన్ తన ఆలోచనను పునారాలోచించుకోవాలని చెప్పారు. అంటే అర్ధమేంటి ? రైతులు వచ్చి అడిగారు కాబట్టి ఏదో మొక్కబడిగా మాట్లాడారని తేలిపోయింది.

 

అమరావతి నుండి రాజధాని విశాఖపట్నంకు తరలిపోకుండా అడ్డుకోవాలని రైతులు అడిగినపుడు ఆ విషయం తమ పరిధిలో లేదని కూడా తాజాగా కిషన్ స్పష్టం చేశారని సమాచారం. రాజధానిని మార్చటం వల్ల రాష్ట్రమంతా అభివృద్ధి జరిగిపోతుందని అనుకోవటం కూడా పొరబాటే అంటూ రైతులకు నాలుగు ఓదార్పు మాటలు చెప్పారంతే. కిషన్ మాటలు విన్న తర్వాత విషయం రైతులకు అర్ధమైపోయింది.

 

ఎలాగూ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రిని కలిశారు కాబట్టి పనిలో పనిగా  శాసనమండలి రద్దు విషయాన్ని కూడా కొందరు ప్రస్తావించారు. అంతా విన్న తర్వాత కిషన్ మాట్లాడుతూ ఏ విషయంలో అయినా కేంద్రప్రభుత్వం రాజ్యాంగబద్దంగానే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అంటే అర్ధమేంటి ? శాసనమండలి రద్దుకు రాష్ట్రప్రభుత్వం పంపిన తీర్మానం విషయంలో కేంద్రం చేసేదేమీ లేదనే కదా. మండలి రద్దయినా పునరుద్ధరణయినా పూర్తిగా రాష్ట్రప్రభుత్వం ఇష్టమే అని అందరికీ తెలిసిందే. కిషన్ మాటల ప్రకారం మండలి రద్దును ఆపటం కూడా కేంద్రం పరిధిలోనిది కాదని తేలిపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: