చైనాలోని వుహాన్  నగరంలో మొదట గుర్తించబడిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ బెంబేలెత్తిస్తున్నది . ఇక చైనా దేశం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైనాలో అతి వేగంగా కరరోనా  వైరస్ వ్యాప్తి చెందుతూ ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు తీసుకుంది. రోజురోజుకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. అయితే కరోనా  వైరస్ తమ తమ దేశాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నాయి. అయితే ప్రపంచ దేశాలను మొత్తం ప్రాణభయంతో గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారత దేశాన్ని కూడా వణికిస్తోంది. ఇప్పటికే భారత్లోకి ప్రవేశించిన కరోనా వైరస్... అందరినీ బెంబేలెత్తిస్తున్నది . 

 

 

 ఇక ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి కేరళ రాష్ట్రంలో ఇద్దరూ ప్రత్యేక చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య మూడుకు చేరింది. కేరళ రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖమంత్రి కే కే శైలజ కూడా నిర్ధారించారు. కేరళ రాష్ట్రంలోని కాసర్గోడ్ జిల్లాలో కరోనా  వైరస్ పాజిటివ్ కేసు నమోదయింది. కాగా ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే కరోనా  వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు భారత్ లో ఎక్కువ ఉండడంతో... భారత ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడ తాము ఉంటున్న ప్రాంతాలకు కూడా వస్తుందోనని... ప్రాణభయంతో నే బతుకుతున్నారు. 

 

 

 ఇక కరోనా  వైరస్ కేసులు రోజురోజుకు పెరిగి పోతుండటంతో భారత్ అప్రమత్తమైంది. చైనా నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణీకులు సహా ఇతర దేశస్తులు ఈ వీసా సౌకర్యాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజింగ్ లో భారత రాయబార కార్యాలయం నుంచి ప్రకటన విడుదల అయ్యింది . అంతేకాకుండా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా లాంటి దేశాల మీదుగా ప్రయాణించే వారిని కూడా భారత్లోకి తాత్కాలికంగా అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో.. విమాన ప్రయాణికులను పరీక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: