విజ‌య‌వాడ‌లో ట్రాఫిక్‌ తరచూ స్తంభిస్తుండడంతో.. విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపారల‌కు ట్రాఫిక్‌ కష్టాలను తొలగించేందుకు ప్రభుత్వం బెంజిసర్కిల్‌లో ప్లైఓవర్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. అయితే ట్రాఫిక్ కష్టాలతో విసిగి వేసారిపోయే బెజవాడ వాసులుకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇక మీ ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయ్. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తోన్న రెండు ఫ్లై ఓవర్లలో ఒక బెంజిసర్కిల్ ప్లైఓవర్ వాడుకకు సిద్దమైంది. నెల క్రితం నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. నేటి నుంచి బెంజి సర్కిల్ ప్లై ఓవర్ పై ట్రయిల్ రన్ నిర్వహించనున్నారు. 

 

వెహికల్ మూమెంట్ తో సాంకేతిక పరిశీలన పూర్తి చేశారు. 1.47 కిలోమీటర్లు త్రీలైన్ ప్లైఓవర్ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు అనుమతి ఇచ్చారు. ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో త్వరలో లాంఛనంగా ఓపెన్ కానుంది. అయితే ఆయన ఎప్పుడు వస్తారనే డేట్‌పై క్లారిటీ లేకపోవడంతో.. రామవరప్పాడు నుంచి వారధి వైపు వెళ్లే వాహనాలను ఫ్లైఓవర్‌లో ప్రయాణించడానికి అనుమతిస్తారు. అలాగే  మార్చిలో రెండవవైపు ప్లైఓవర్ కు శంఖుస్ధాపన జ‌ర‌గ‌నుంది. బెంజిసర్కిల్ లో రెండు వైపులా ఆరులైన్ల ప్లైఓవర్ కోసం 220 కోట్లు బడ్డెట్ కేంద్రం మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. 

 

కాగా, రాజధాని ప్రకటన చేసిన తర్వాత ఈ ఐదేళ్ళలోనే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో బెజవాడ వాసులు బెంజిసర్కిల్ వద్ద ఫ్లై ఓవర్ ఏర్పాటు కోసం ఏళ్ళ క్రితం నుంచే ఎదురు చూశారు. రెండేళ్ళ క్రితం టీడీపీ హయాంలో బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ పట్టాలెక్కింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని చొరవ తీసుకొని దీనిపై కేంద్రంలో నితిన్ గడ్కరీతో మాట్లాడి రెండు దశల్లో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇలా చాలా కాలం త‌ర్వాత బెంజిసర్కిల్ ప్లైఓవర్ అందుబాటులోకి రావ‌డంతో వీరి ట్రాఫిక్ క‌ష్టాలు తీరిన‌ట్టే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: