వుహాన్  నగరంలో గుర్తించబడిన కరుణ వైరస్  ప్రస్తుతం చైనా నగరాన్ని ప్రాణభయంతో బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాణాంతకమైన ఈ కరోనా  వైరస్ బారినపడి వందల మంది ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో కరోనా  వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకును వెళ్లదీస్తున్నారు. కేవలం చైనా మాత్రమే కాదు ప్రపంచ దేశాలు కూడా కరోనా వైరస్ పేరెత్తితేనే  బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడ కరోనా  వైరస్ తమ దేశ పరిధిలోకి వ్యాపించి తమ దేశ పౌరుల ప్రాణాలను బలిగొంటోందోనని  ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపడుతున్నాయి  పలు దేశాల ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 

 

 అయితే చైనాలో కరోనా  వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు... భారీగా ఆర్ధిక   నష్టం కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం టెక్నాలజీ రంగం పై భాగానే  పడింది. అయితే చైనా కేంద్రంగా అనేక ఐఫోన్ ఉత్పత్తి ప్లాంట్లను కలిగి ఉండగా...  కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఐఫోన్ ల ఉత్పత్తి కూడా తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రముఖ ఆపిల్ అనలిస్ట్ మింగ్ చి కువో  పలు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఆపిల్ కంపెనీ నూతన ఐఫోన్ ఎస్ఏ 2 లేదా ఐఫోన్9 లను  మార్చిలో విడుదల చేయడానికి నిర్ణయించిందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐఫోన్లను ఆపిల్ ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాల్సి ఉండగా... ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ దెబ్బకు ఐఫోన్ లో ఉత్పత్తి చాలావరకు తగ్గిందని మింగ్ చి కువో  అంచనా వేస్తూన్నారు .

 

 

 అంతేకాకుండా ఐఫోన్ ల ఉత్పత్తి కూడా పది శాతం మేర తగ్గి అవకాశాలు ఉన్నాయని... 36 నుంచి 40 మిలియన్ల యూనిట్ల ఐఫోన్ ల ఉత్పత్తి తగ్గుతుంది అంటూ ఆయన తెలిపారు. కాగా  ఐఫోన్ ఇప్పటికే చైనాలో ఉన్న తన కార్పొరేట్ ఆఫీసులో స్టోర్లు  కాంటాక్ట్ సెంటర్లను కూడా ఫిబ్రవరి 9వ తేదీ వరకు మూసివేయాలని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐఫోన్లు ఉత్పత్తి చాలా తక్కువ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు చూడాలి మరి. ఇక అటు కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న విషయం తెలుసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: