చైనాలోని వుహాన్ గరంలో మొదట గుర్తించబడిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణ భయంతో గడగడా వణికిస్తోంది. ఎంతో మంది ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ప్రాణాలను గాల్లో కలిపేస్తుంది . చైనాలో అతివేగంగా విజృంభిస్తున్న ప్రాణాంతకమైన కరోనా వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలిగొంది. ఇక ఇప్పటికే 25 దేశాలకు కూడా భయంకరమైన ప్రాణాంతక వైరస్ పాకిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా దేశాల ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది. కరుణ వైరస్ బారినపడి ఇప్పటికే జనాలు పిట్టల్లా రాలిపోతున్నట్లు  రాలిపోతున్నారు. 

 

 

 ఈ ప్రాణాంతకమైన మాయదారి కరోనా వైరస్ బారినపడి... చైనాలో 425 మంది మృతి చెందారు. ఇక చైనా దేశంలో మొత్తంగా 20 వేల 400 మందికి ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకింది. దీంతో అందరూ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితిలో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కరోనా  వైరస్ చైనా దేశంలో రోజురోజుకు విజృంభిస్తుండంతో పలు  నగరాలకు రవాణాను బందు చేశారు. ముఖ్యంగా ఊహాన్  నగరంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అయితే రోజురోజుకు ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్న  ఈ వైరస్ కి   వ్యాక్సిన్ లేకపోవడంతో... ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోవడం తథ్యం గా మారిపోయింది. 

 

 

 కాగా కరోనా వైరస్ బాధితులు రోజురోజుకు పెరిగి పోతుండటంతో కేవలం తొమ్మిది రోజుల్లోనే కరోనా  వైరస్ బాధితుల కోసం వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించింది అంటే కరోనా  వైరస్ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా  వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో యుద్ధ ప్రాతిపదికన అతి తక్కువ సమయంలోనే వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించిన దేశంగా చైనా రికార్డు సృష్టించారు. అటు భారత దేశాన్ని కూడా కరోనా  కలవరపెడుతోంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు  వెల్లడించారు. ఇక అటు హైదరాబాద్లో కూడా ఫీవర్ ఆసుపత్రి లో ఇద్దరు కరోనా  అనుమానితులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ ఐసొలేషన్  వార్డుల్లో పరీక్షలు నిర్వహి స్తూ వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: