`విశాఖపట్టణంలో పాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన తుగ్ల‌క్ నిర్ణ‌యం` ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు చెందిన ప‌త్రిక‌ ఆర్గనైజర్ లో 'తుగ్లకీ జగన్' క్యాప్షన్ తో రాసిన‌ వ్యాసం సారంశం. దీనిపై స‌హ‌జంగానే ఎల్లో మీడియా గంగ‌వెర్రులు ఎత్తింది. అయితే, తాజాగా ఇంకో క‌హానీ అల్లింది. ఆర్గ‌నైజ‌ర్ క‌థ‌నంతో అధికార వైసీపీ నేత‌ల‌కు వ‌ణుకు పుడుతోంద‌నేది దాని సారాంశం. ఇంత‌కీ అలాంటి ప‌రిస్థితి ఉందా?

 

ఆర్గనైజర్ పత్రికలో ఒక ప్రీలాన్స్ జర్నలిస్టు రాసిన వ్యాసంలో...ఏపీలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడం, మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడం, మండలి రద్దు వంటి అంశాలను ప్రస్తావించారు. ఇలాంటి ఆలోచనలు ప్రమాదకరమనీ, అవి ఏపీ ప్రగతిని దెబ్బతీస్తాయనీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా `ర‌చ‌యిత‌` సూచించారు. అయితే, ఇప్ప‌టికే దీనికి ఈ వ్యాసం ఆర్ఎస్ఎస్ అబిప్రాయం అన్నట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేసేశారు. . ఈ క‌థ‌నంతో ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌లు సీరియ‌స్‌గా ఆలోచిస్తార‌ని...మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంతో ముందుకు సాగుతున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు బ్రేకులు వేస్తార‌ని జోస్యం చెప్పారు. 

 

 

తాజా ఎత్తు ఏంట‌య్యా అంటే....ఆర్ఎస్ఎస్ నిర్ణ‌యం బీజేపీ శిర‌సా వ‌హిస్తుంద‌ని...శాసనమండలి రద్దు బిల్లు కేంద్ర ఆమోదానికి వెళ్లిన తరుణంలో సంఘ్ ప‌త్రిక‌లో ఇలాంటి అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వ‌డం ఢిల్లీ పెద్దలు సీరియ‌స్‌గా తీసుకుంటార‌ని...అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతల‌కు టెన్ష‌న్ పుడుతోంద‌ట‌. అయితే, ఇప్ప‌టికే కేంద్రం రాజ‌ధాని త‌న‌కు సంబంధించింది కాద‌ని స్ప‌ష్టం చేసింది. బీజేపీ ముఖ్య‌నేత‌లే...ఈ విష‌యంలో సైలెంట్ అయిపోయారు. అలాంటి త‌రుణంలో...అనుబంధ విభాగం ప‌త్రిక‌లో వ‌చ్చిన `ఫ్రీలాన్స్ ` రాత‌ను ఢిల్లీ పెద్ద‌లు అంత సీరియ‌స్‌గా తీసుకుంటారా? ఎల్లో మీడియా గ‌గ్గోలు నిజ‌మ‌వుతుందా?  వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: