అధికారంలో ఉన్న ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే తాము ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో కీలకంగా మారిపోతాయి. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ఇదే జరుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కేజ్రీవాల్ విజయ ఢంకా మోగించడం ఖాయమని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అటు పొలిటికల్ పండితులు కూడా ఇదే మాట అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలోనే 45% పైగా ఓట్లు కేజ్రీవాల్కి పడతాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు... కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాల కారణంగానే ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ వైపు ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ నమ్ముకున్న పథకాలే ప్రస్తుతం కేజ్రీవాల్ కు విజయాన్ని కట్టబెట్టేట్లు  కనిపిస్తుంది. 

 

 

 ముఖ్యంగా బస్తీ బస్తీ కి దావకాన లు, ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన నాణ్యమైన విద్యాబోధన, విద్యుత్తు రాయితీలు, నల్ల నీరు సరఫరాతో పాటు పలు సంస్కరణలను తీసుకొచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం. కాగా  ఈ పథకాలన్నీ ఢిల్లీ ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాజిటివ్ ఓట్లు తీసుకురాను ఉన్నాయి కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు. అయితే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకొన్ని రోజుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా... తాము ప్రవేశపెట్టిన పథకాలు ప్రచార రథాలు గా మారి తమ ప్రభుత్వానికి విజయాన్ని కట్టబెట్టడం లో కీలక పాత్ర పోషిస్తాయని నమ్మకంతో ఉంది జగన్ సర్కార్. 

 

 

 ముఖ్యంగా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... అమ్మ ఒడి పథకం... పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం.. మధ్యాహ్న భోజనం.. ఇంటింటికి పెన్షన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలను ప్రవేశ పెట్టింది జగన్ సర్కారు. జగన్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలతో అటు  రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అంతే కాకుండా జగన్ సర్కార్ అన్ని వర్గాలకు ఇప్పటికే ఏదో ఒక పథకాన్ని ప్రవేశపెట్టి సంతృప్తి పరచింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ సర్కార్ కు ఈ పథకాలు ఓట్లు రాల్చనున్నాయని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: