రాష్ట్రంలో ప్రతిపక్షాలు విచిత్రమైన రాజకీయం చేస్తున్నాయి. శాసనమండలి రద్దు విషయంలో  తెలుగుదేశంపార్టీ చేస్తున్న చవకబారు రాజకీయానికి బిజెపి, పిడిఎఫ్ పార్టీలు కూడా మద్దతు ఇస్తుండటమే విచిత్రంగా ఉంది. శాసనమండలిలో రెండు బిల్లులపై జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. రెండు రోజుల పాటు రచ్చ జరిగిన తర్వాత మండలి ఛైర్మన్ మాట్లాడుతూ రెండు బిల్లులను సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపుతున్నట్లు ప్రకటించేసి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసేశారు.

 

నిజానికి తనంతట తానుగా సెలక్ట్ కమిటి పరిశీలనకు బిల్లులను పంపే అధికారం ఛైర్మన్ కు లేదు. అందుకనే తాను తప్పు చేస్తున్నట్లు ఛైర్మన్  ముందే చెప్పేసి ఆ తర్వాత సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ప్రకటించారు. ఛైర్మన్ ప్రకటన వెనుక చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు ఒత్తిడి ఉన్నట్లు వైసిపి ఆరోపిస్తోంది. ఆ తర్వాత సెలక్ట్ కమిటికి సభ్యులను ప్రతిపాదించమని అడగాల్సిందిగా ఛైర్మన్ అధికారులను ఆదేశించారు. అయితే అధికారులు ఛైర్మన్ తో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం సెలక్ట్  కమిటిని ప్రకటించే అధికారం ఛైర్మన్ కు లేదన్న విషయాన్ని వివరించారు.

 

అదే సమయంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఛైర్మన్ ఆదేశాలను అడ్డుకున్నారు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక అధికారులు మధ్యలో నలిగిపోతున్నారు. అయితే అధికారుల నుండి పార్టీలకు లేఖలు రాకపోయినా టిడిపి మాత్రం  సెలక్ట్ కమిటిలో సభ్యులను ప్రతిపాదించింది. దాంతో బిజెపి, పిడిఎఫ్ లు కూడా చెరో ఇద్దరు సభ్యులను ప్రతిపాదిస్తు లేఖలు అందించాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లేని కమిటికి పార్టీలు సభ్యులను ప్రతిపాదిస్తున్నాయి.

 

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్ళమని  ఛైర్మన్ ను వెనకనుండి టిడిపి బాగా ఒత్తిడి పెడుతున్నట్లు అర్ధమైపోతోంది. దాంతో నిబంధనల ప్రకారం నడుచుకోలేక, టిడిపి ఒత్తిడిని తట్టుకోలేక ఛైర్మన్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిసిపోతోంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: