ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మెరిసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు పూర్తిగా దూరమైంది విజయశాంతి. ఇక తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి వస్తే బాగుండు అని ఎంతోమంది అభిమానులు భావించారు. ఈ క్రమంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి అభిమానుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. అయితే తమ  అభిమాన నటి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది అని ఉత్సాహంతో ఉన్న అభిమానుల ఆనందం ఎక్కువ రోజులు నిలువ లేదు. తాజాగా తాను ఇక సినిమాలు చేయను  అంటూ చెప్పకనే చెప్పారు విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి తను ఆచరించి ప్రేమను చూపించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఓ ట్విట్ పెట్టారు  టాలీవుడ్ లేడీ అమితాబ్ విజయశాంతి. 

 

 

 ప్రస్తుతం అటు రాజకీయాల్లో సినిమాల్లో విజయశాంతి అంశం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి మంచి పాత్రలు రావడం... ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సమయంలో సినిమాలకు దూరం కావాలని నిర్ణయాన్ని విజయశాంతి ఎందుకు తీసుకున్నారు అనే దానిపై చర్చ నడుస్తోంది. అయితే విజయశాంతి అభిమానులు మాత్రం విజయశాంతి నిర్ణయంతో కాస్త హర్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే విజయశాంతి ఎందుకు సినిమాలకు సెలవు అని చెప్పారు అనేదానిపై విజయశాంతి సన్నిహిత  వర్గాల నుంచి ఎలాంటి స్పందన కూడా రావడం లేదు. 

 

 

 కానీ విజయశాంతి మరోసారి పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పడం పై రాజకీయ వర్గాల్లో మాత్రం ఓ వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మొదట్లో టిఆర్ఎస్తో రాజకీయాల్లో మెరిసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళింది విజయశాంతి. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎక్కడ తెరపై కనిపించడం లేదు. అప్పుడప్పుడు వచ్చి అధికార పార్టీపై పలు విమర్శలు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం ఎక్కడ తెరమీద కనిపించడం లేదు విజయశాంతి.కాగా  ఇంకొన్ని రోజుల్లో విజయశాంతి బీజేపీ లోకి వెళ్ల పోతున్నారు అని  తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయశాంతి దూకుడుగా రాజకీయాలు చేస్తారన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా తెలంగాణలో విజయశాంతికి  మంచి ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో విజయశాంతి ని బీజేపీ లో చేర్చుకుంటే పార్టీకి కలిసొచ్చే అంశమని అటు బీజేపీ నేతలు కూడా భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: