మూడు రాజధానుల ఏర్పాటు, శాసనమండలి రద్దు విషయంలో కేంద్రప్రభుత్వం మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద షాకే ఇచ్చింది. పై రెండు అంశాల విషయంలో కేంద్రం జోక్యం ఉండదంటూ తాజాగా పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పేసింది. ఇదే విషయాన్ని  బిజెపి సీనయర్ నేతలు చెబుతున్నా పవన్ మాత్రం పట్టించుకోలేదు. కానీ పార్లమెంటు సాక్షిగా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో  అదే విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది.

 

జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనను చంద్రబాబునాయుడుతో పాటు పవన్ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సరే ఈ విషయంలో బిజెపి రాష్ట్ర నేతలకు, జాతీయ స్ధాయి నేతలకు మధ్య చాలా తేడా ఉంది. రాష్ట్రంలోని నేతలు జగన్ ప్రతిపాదనను వ్యతిరకిస్తున్నారు. అదే సమయంలో  రాష్ట్రప్రభుత్వం నిర్ణయాల్లో కేంద్రం జోక్యం ఉండదంటూ క్లారిటి ఇస్తున్నారు.

 

ఈ నేపధ్యంలోనే ఒకవైపు చంద్రబాబు రాజధాని గ్రామాల్లో రైతులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తుంటే పనవ్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. బిజెపితో పవన్ పొత్తు పెట్టుకోవటంలో జగన్ ను దెబ్బతీయటమే ఏకైక టార్గెట్ గా పావులు కదుపుతున్న విషయం అందరికీ అర్ధమైపోయింది. అందుకనే బిజెపితో పొత్తు పెట్టుకున్న దగ్గర నుండి పవన్ రెచ్చిపోయి జగన్ కు వార్నింగులు కూడా ఇస్తున్నారు.

 

కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి లాగే పవన్ కూడా మాట్లాడుతూ రాజధానిని అమరావతి నుండి అంగుళం కూడా కదలనిచ్చేది లేదంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే తాజాగా టిడిపి ఎంపి గల్లా జయదేవ్ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ రాజధాని ఏర్పాటు, శాసనమండలి అంశాల్లో కేంద్రం జోక్యం ఉండదని తేల్చి చెప్పేశారు.

 

మరి రాజధాని తరలింపు విషయంలో పవన్ ఇపుడు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు ? అన్నది ఆసక్తిగా మారింది. బిజెపి మద్దతుతో జగన్ ను ఏదో చేసేద్దామని అనుకున్న పవన్ కు ఊహించని షాక్ అనే చెప్పాలి. మరిపుడు పవన్ ఏం చేస్తారో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: