చంద్రబాబునాయుడు రాజకీయాలు ఎంత నీచంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా చంద్రబాబు వ్యవహరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా శాసనమండలి రద్దు తీర్మానం ఢిల్లీకి చేరిన నేపధ్యంలో మరోసారి తన నీచ రాజకీయాలకు తెరలేపారనే ప్రచారం రోజు రోజుకు పెరిగిపోతోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే శాసనమండలి రద్దుకు అసెంబ్లీ చేసిన తీర్మానం ఢిల్లీకి చేరిన విషయం అందరికీ తెలిసిందే. శాసనమండలి రద్దు అయితే తెలుగుదేశంపార్టీకి సంబంధించిన 34 మంది ఒక్కసారిగా పదవులు కోల్పోతారు. వీరిలో యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ వంటి ప్రముఖులున్నారు. సరే యనమల విషయాన్ని పక్కన పెట్టేసినా కొడుకు పదవిని కాపాడుకోవటం కోసం చంద్రబాబు చాలా చవకబారు ప్రతిపాదనను పంపినట్లు ప్రచారం జరుగుతోంది.

 

ఢిల్లీ బిజెపి నేతల దగ్గరకు తన దూతను పంపించిన చంద్రబాబు టిడిపిలోని 34 మంది ఎంఎల్సీల్లో ఓ 20 మందిని బిజెపిలోకి పంపేస్తానంటూ ప్రతిపాదన పంపారని సమాచారం. ఇదే విషయాన్ని వైసిపి నేతలు కూడా  పదే పదే ప్రస్తావిస్తున్నారు. నిజానికి తన పార్టీలోని ఎంఎల్సీలను ఎవరూ ఇంకో పార్టీలోకి పంపుతాననే ప్రతిపాదన చేయరు. అయితే చంద్రబాబు మిగిలిన రాజకీయ నేతల్లాగ కాదు. విషయం ఏదైనా తన ప్రయోజనాలను మాత్రమే చూసుకునే వ్యక్తిగా చాలా పాపులర్.

 

జగన్ దెబ్బకు శాసనమండలి గనుక రద్దైతే పదువులు పోయి మాజీలయ్యే వాళ్ళల్లో కొడుకు లోకేష్ కూడా ఉంటాడు. పైగా షెడ్యూల్ ప్రకారం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కొడుకు గెలిచేది కూడా అనుమానమే. అదే గనుక జరిగితే లోకేష్ రాజకీయ భవిష్యత్తు దాదాపు ముగిసినట్లే. అందుకనే ఎలాగైనా మండలి రద్దును అడ్డుకునేందుకు నీచమైన ప్రతిపాదన చేసినట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. వైసిపి ఎంఎల్ఏ రోజా మాట్లాడుతూ మండలి రద్దును అడ్డుకోవటం ద్వారా లోకేష్ భవిష్యత్తు కోసం నీచానికి దిగజారినట్లు ఆరోపించింది ఇందుకే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: