ఒకప్పుడు  మద్యం వైపు చూడాలంటేనే యువత భయపడేవారు కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా బార్లో కూర్చుని ఫుల్ గా తాగేస్తున్నారు. అయితే దోస్తులు అందరూ ఒకచోట చేరారు అంటే ఇక మందు పార్టీ తప్పనిసరి. ఎవరి దగ్గర పైసలు లేకున్నా.. అందరూ చెరో  రూపాయి వేసుకుని మందు పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే మందు పార్టీ చేసుకుంటున్న వారి లో కొంతమంది మందు తాగని వారూ  కూడా ఉంటారు... ఇంకేముంది ఒక్క పెగ్గు వేసి తరువాత మందు తాగని వాడిని  తాగు తాగు అంటూ బలవంతం చేసే ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. ఇలాంటి వాడు ప్రతి గ్యాంగ్ లో ఒకడుంటాడు. ఫ్రెండ్స్ అందరు ఎంత ఫోర్స్  చేసినప్పటికీ వాడు మద్యం తాగడం అంటే తాగను అంటాడు. అలాంటప్పుడు ఏం చేస్తారు వీడు తాగడు లే మనం కానిచ్చేద్దాం అంటూ కంటిన్యూ చేస్తూ ఉంటారు.

 

 

 కానీ ఇక్కడ మాత్రం ఎంత బతిమాలినా మద్యం తాగేందుకు స్నేహితుడు నిరాకరించడంతో ఆ వ్యక్తిపై బీరు బాటిల్ తో దాడి చేశాడు మరో స్నేహితుడు.ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ దారుణ ఘటన. మచిలీపట్నం సమీపంలోని బంటుమిల్లి కి పద్దెనిమిదేళ్ల దినేష్ కు ఓ కేసు విషయమై పోలీస్ స్టేషన్ లో సంతకం చేసేందుకు సోమవారం వచ్చాడు. స్నేహితుడు గణేష్ తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు చేరుకుని వచ్చిన పనిని పూర్తి చేసుకున్నాడు ఆ యువకుడు. ఇక ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఈ  ఇద్దరు స్నేహితులకు నవీన్ సాయి అనే మరో ఇద్దరు స్నేహితులు తోడయ్యారు. 

 

 

 ఇంకేముంది అందరూ ఒకచోట చేరాక మందు పార్టీ చేసుకోవడం కామన్ కదా. వీరు  కూడా అలాగే మందు పార్టీ చేసుకోవాలి అని భావించారు. ఇక మద్యం తెచ్చుకొని తాగుతున్న సమయంలో గణేష్ సాయి నవీన్ మద్యం తాగగా దినేష్ మాత్రం మద్యం తాగేందుకు నిరాకరించాడు. మద్యం తాగమని  దినేష్ ను నవీన్ పలుమార్లు బతిమాలినప్పటికి కూడా దినేష్ మద్యం తాగేందుకు నిరాకరించడంతో... వారి మధ్య ఘర్షణ మొదలైంది. ఇక ఆకర్షణ కాస్త చిలికి చిలికి గాలి వానలా తయారైందన్నట్టు  మరింత పెరిగి పోవడంతో కోపం పట్టలేని నవీన్ తన చేతిలో ఉన్న బీరు సీసాలతో దాడి చేశాడు. దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన దినేష్ ను  తోటి స్నేహితులు ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: