తెలంగాణ ములుగు జిల్లా లో జరిగే సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర ప్రపంచంలోనే అత్యంత అరుదైనది. ఎలాంటి విగ్రహాలు లేకుండా జరిగే మొదటి జాతర సమ్మక్క సారలమ్మ జాతర. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మేడారం జాతరకు భక్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. కుంభమేళా తర్వాత ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే ది మేడారం జాతర కి. అందుకే మేడారం జాతర తెలంగాణ కుంభ మేళా అని పిలుస్తుంటారు. కాగా నేటి నుంచి మేడారం జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మేడారం జాతరకు ముందు నుంచే భక్తజనసందోహంతో మేడారం పరిసర ప్రాంతాలను కిక్కిరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు మేడారం చేరుకొని సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. 

 

 

 కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది గిరిజనులు సమ్మక్క-సారలమ్మ జాతర.. మేడారం చేరుకుని ఇక్కడ అమ్మ వార్లను పూజిస్తూ ఉంటారు. కాగా  నేటి నుంచి సమ్మక్క-సారలమ్మ మేడారం మహాజాతర ప్రారంభమైంది. ఇప్పటికి తెలుగు రాష్ట్రాల నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సులు సౌకర్యాలు కూడా కల్పించారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో లక్షల సంఖ్యలో ఇప్పటికే మేడారం చేరుకున్నారు భక్తులు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మేడారంకు వచ్చే భక్తులందరికీ ఏదో కోరికతో దేవతలను దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. 

 

 

 ముఖ్యంగా సంతానం లేనివారు మేడారం జాతరకు వచ్చి సమ్మక్క సారలమ్మల జాతర ఈ సందర్భంగా పిల్లలు పుట్టాలని వరం పడతారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి... వెదురు వనం కొబ్బరికాయలతో పూజలు చేసి... పిల్లలు పుట్టాలంటూ  సమ్మక్క సారలమ్మలను స్మరించుకుంటూ ముడుపులు కడుతూనే ఉంటారు. ఇలా చేయడం ద్వారా తమకు సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక అక్కడి నుంచి తడి బట్టలతోనే సారలమ్మ గుడికి  చేరు కుంటారు భక్తులు. సారలమ్మను  గద్దెకు తీసుకు వచ్చేటప్పుడు దారికి అడ్డంగా సాష్టాంగ  నమస్కారం చేస్తూ.... కోరికలు మనసులో తలుచుకుంటూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా సమ్మక్క సారలమ్మలు తమ కోరికలు తీరాస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: