రాజధాని ఆందోళనను జనాలెవరూ పట్టించుకోవటం లేదని స్వయంగా చంద్రబాబునాయుడే ఒప్పేసుకున్నాడా ? తెనాలి బహిరంగ సభలో  మాట్లాడిన మాటలు చూస్తుంటే అందరికీ అదే అనుమానం పెరిగిపోతోంది. అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా జేఏసి ఆధ్వర్యంలో తెనాలిలో మంగళవారం రాత్రి బహిరంగ సభ జరిగింది లేండి. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎప్పటిలాగే జగన్మోహన్ రెడ్డిని అమ్మనాబూతులు తిట్టారు. పనిలో పనిగా జనాలను కూడా శాపనార్ధాలు పెట్టారు లేండి.

 

ఆ సందర్భంలోనే మాట్లాడుతూ అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో జనాలెవరూ పాల్గొనటం లేదని నిష్టూరాలాడారు. తాను చేస్తున్న పోరాటం తానొక్కడి కోసమే కాదని జనాలందరి కోసం తాను పోరాటం చేస్తుంటే జనాలెవరికీ పట్టటం లేదంటూ పదే పదే శాపనార్ధాలు పెట్టటమే విచిత్రంగా ఉంది. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే రాజధాని తరలింపు అంశాన్ని జనాలెవరూ పట్టించుకోవటం లేదని.

 

నిజానికి సచివాలయం అమరావతిలో ఉన్నా ఒకటే లేకపోతే విశాఖపట్నంలో ఉన్నా ఒకటే. ఎందుకంటే సచివాలయం ఎక్కడుంటే అక్కడికి అవసరమైన వాళ్ళు మాత్రమే వెళతారు. సచివాలయం తమ ఊరిలోనే ఉంది కదా అని ఊరి జనాలందరూ రోజు సచివాలయంకు రారు కదా ?  రాజధాని అమరావతిలోనే కంటిన్యు అవ్వాల్సిన అవసరం చంద్రబాబు అండ్ కో కు మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ వల్ల మాత్రమే అనే ప్రచారం పెరిగిపోయింది. అందుకనే జనాలెవరూ చంద్రబాబును పట్టించుకోవటం లేదు.

 

ఇంతచిన్న విషయాన్ని కూడా చంద్రబాబు గ్రహించకుండా అప్పటికేదో రాష్ట్రాన్ని అమరావతిని తానొక్కడే ఉద్ధరించేస్తున్నట్లు, పోరాటాలు చేస్తున్నట్లు బిల్డప్పులిస్తున్నారు. అసలు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయమని జనాలెవరూ చంద్రబాబును కోరలేదు. తనవసరాల కోసం చంద్రబాబే జనాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా పోరాటాల పేరుతో జేఏసి అంటూ ఓ వేదికొకటి. ఆ ప్రయత్నాలను జనాలు పట్టించుకోకపోవటంతో శాపనార్ధాలు పెడుతున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: