ఏదైనా పని తలపెడితే దాని సాధించే వరకు నిద్రపోకుండా... నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ... అదే ఆశ ,శ్వాస అన్నట్టుగా పని చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వ్యక్తుల్లో ఏపీ సీఎం జగన్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్ ఎంత పట్టుదలతో ఉన్నారు అనేది చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో జగన్ ఎన్నో విమర్శలు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకుండా అందరికి ఈ విషయాన్ని అర్ధమయ్యేలా చెబుతూ చేస్తూ వస్తున్నారు. 


ఇక అమరావతిని తరలించవద్దు అంటూ ప్రతిపక్ష టిడిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ రైతులను కూడా ఈ ఉద్యమంలోకి తీసుకొస్తూ జగన్ ప్రభుత్వాన్నిఇబ్బనులు పెడుతోంది. ఇవన్నీ భరిస్తూనే జగన్ కూడా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు కేంద్రం కూడా జగన్ నిర్ణయానికి మద్దతుగా నిలబడడంతో తన పనిని సక్సెస్ చేసుకునే పనిలో పడ్డాడు ఏపీ సీఎం. అసలు అమరావతి కంటే విశాఖను జగన్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. 


ఇదే రకమైన అనుమానాలు కేంద్ర పెద్దల్లోనూ ఉన్నాయి. ఈ అనుమానాలు తీరుస్తూ జగన్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. విజయవాడలోని గేట్వే హోటల్ లో ది హిందూ ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరైన జగన్ రాజధాని అంశంపై ప్రసంగించారు. అసలు తాను రాజధానిగా విశాఖను ఎంచుకోవడానికి గల కారణాలను జగన్ స్పష్టంగా వివరించారు. అమరావతి లో పెట్టిన ఖర్చు కేవలం 10 శాతం పెడితే విశాఖపట్నం ఇప్పటికే చాలా అభివృద్ధి చెంది ఉండేదని జగన్ అన్నారు.


 ఇప్పుడు అక్కడ అభివృద్ధి చేపడితే మరో పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు ధీటుగా విశాఖ అభివృద్ధి చెందడంతో పాటు  వాటిని మించిన నగరంగా  మారుతుందని, అమరావతిలో ఇప్పుడు అభివృద్ధి చేయడం మొదలుపెట్టినా ఆ స్థాయికి వెళ్లేందుకు చాలా సమయం పడుతుందని జగన్ ఆ సభలో ప్రసంగించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: