ప్రేమికుల్లో ముద్దులు చిన్న చిన్న స‌ర‌దాల‌న్న‌వి స‌ర్వ స‌హ‌జం. అయితే అవి కొంద‌రు మోటుగా ప్ర‌వ‌ర్తిస్తే మ‌రి కొంద‌రు స్మూత్‌గా ఉంటారు. ఇక మ‌రికొంత మందైతే ముద్దుల‌తో ప్ర‌పంచాన్నే ఏకంగా మ‌ర్చిపోతారు. ఓ ప్రేమజంట మాత్రం తమ ముద్దు కారణంగా వార్తల్లో నిలిచారు.అలాగని వారేమీ రికార్డు స‌ృష్టించలేదు. ఇటీవ‌లె ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి అమెరికాలో చోటుచేసుకుంది. 

 

అమెరికాలోని డెట్రాయిట్‌లో యూలెట్ వెడ్జ్‌వార్త్ యాభైరెండేళ్ళ‌  మహిళ తన ప్రియుడి ని ముద్దు పెట్టుకోవాలని కోరడంతో అతను స‌రే అన్నాడు. అయితే ముద్దు పెట్టేటప్పుడు నాలుక బయటకు తీయవద్దని ఆమె అతడిని హెచ్చరించింది. అయినా స‌రే అత‌ను వినకుండా ఆ ప్రియుడు ముద్దు పెట్టుకునే సమయంలో నాలుకను బయటకు తీయడంతో ఆమెకు అసహ్యం కలిగింది.

 

దీంతో  స‌హ‌నం కోల్పోయిన ఆమె అతడి నాలుకను క‌సిగా గట్టిగా కొరికింది. కాగా ఆ ప్రియుడి నాలుక‌ తెగిపడటంతో తీవ్ర రక్తశ్రావం అయ్యింది. ర‌క్తం ధార‌లుగా పోవ‌డంతో వెంట‌నే స్థానికులు స్పందించి అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఏదైనా స‌రే ఎక్కువ‌గా ఒత్తిడికి లోన‌వకూడ‌దు. మ‌నం చేసే ప‌ని ఏదైనా స‌రే కాస్త ఆలోచించి చేయాలి. 

 

భార్యాభ‌ర్త‌లైన‌, ప్రేమికులైనా స‌రే శృంగార స‌మ‌యంలో ఒక‌రికి ఒక‌రు న‌చ్చిన విషయాలు ముందుగా తెలుగ‌సుకుని దానికి అనుకూలంగా ప్ర‌వ‌ర్తిస్తే ఎలాంటి అన‌ర్ధాలు జ‌ర‌గ‌వు. కానీ చాలా మంది కొన్ని ప‌ద్ధ‌తులు పాటించ‌రు. వ‌ద్ద‌న్నా ప‌నే చేయ‌డంతో ఆ స‌మ‌యంలో అలా జ‌రిగిపోతుంది. ఇటీవ‌లె ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది అప్పుడు ప్రియుడే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా పోలీసులు ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని ఐదువేలు జ‌రిమానాతోపాటు ఏడాదిపాటు జైలు శిక్ష కూడా విధించారు.  ఇక ఈ విష‌యంలో కూడా అంతే యూలెట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ నెల 19న ఈ కేసు న‌మోదు చేసుకుని విచారణ చేప‌ట్టారు. ఇక ఈ విష‌యం పై కూడా కేసు న‌మోదు చేసి ఏడాది పాటు జైలు శిక్ష‌ను విధించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: