కరోనా  వైరస్... ఈ పేరు చెబితే చాలు ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ పేరు నమోదు చేస్తే చాలు ఉలిక్కి  పడుతున్నారూ. అంతలా ప్రపంచ దేశాల ప్రజలను ప్రాణభయంతో కలవరపెడుతోంది కరోనా వైరస్. ఏదో  ఇంట్లో దొంగలు పడితే అందినకాడికి దోచుకో పోయినట్లు... కరోనా  వైరస్ కూడా అందరికీ సోకి అందినకాడికి ప్రాణాలు తీసుకుపోతుంది.చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించబడిన కరోనా  వైరస్ ప్రస్తుతం చైనా  దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. చైనాలో ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా... వేల సంఖ్యలో కరోనా  వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకును వెళ్లదీస్తున్నారు. ఇక ప్రతిరోజు పదుల సంఖ్యలోనే చైనాలో కరోనా  వైరస్ బారిన పడి చని పోతున్నారు. 

 

 

 ఇక కరోనా వైరస్ బాధితుల కోసం చైనా దేశంలో యుద్ధ ప్రాతిపదికన ఆస్పత్రులను కూడా నిర్మిస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా తమ దేశ పరిధిలోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. విమానాల ద్వారా తమ తమ దేశాలకు వస్తున్న వారిని విమానాశ్రయాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం దేశంలోకి అనుమతిస్తున్నారు. ఇప్పటికీ పలు దేశాలు కరోనా  వైరస్ అనుమానితుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే కరోనా  వైరస్  చైనా దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందిన విషయం తెలిసిందే.అయితే  చైనా ప్రకటిస్తున్న కరోనా  మృతుల సంఖ్య అబద్ధం చైనాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. 

 

 

 కరోనా  వైరస్ బారినపడి ఇప్పటివరకు చైనాలో 600 మందికి పైగా మరణించారు అంటూ చెబుతుంది చైనా ప్రభుత్వం. కానీ 25 వేల మందికి ఈ వ్యాధి సోకినట్లు  చెబుతోంది. అయితే ప్రభుత్వం కేవలం 600 మంది మాత్రమే చనిపోయారని చెబుతున్నప్పటికీ వైరస్ బారినపడి ఇప్పటి వరకు 25 వేల మందికి పైగా చనిపోయారని .. లక్ష యాభై నాలుగు వేలకు మందికి పైగా వైరస్ భారిన పడినట్లు చైనాకు చెందిన టెన్సన్ట్ సంస్థ వెల్లడించింది. ప్రభుత్వం అసలు నిజాలు చెప్పడం లేదని ఆరోపించింది. అయితే కరోనా వైరస్ బారినపడి మృతి చెందినవారి సంఖ్య ప్రభుత్వం తెలిపిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: