కరోనా  వైరస్ ప్రస్తుతం చైనా దేశాన్ని ప్రాణ భయంతో గజగజ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. వేల సంఖ్యలో కరోనా వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకుతున్నారు. కరోనా  వైరస్ కు మందు లేకపోవడంతో కరోనా  వైరస్ సోకితే మరణం తథ్యం అవుతుంది. అయితే చైనా దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందిన కరోనా వైరస్ ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. అయితే కరోనా  వైరస్ మనుషుల ప్రాణాలను బలి కొనడమే కాదు... మహిళల మానాలకు  ఆత్మరక్షణ కూడా కల్పిస్తోంది. కామాంధుల  బారినుంచి మహిళలను రక్షిస్తోంది కరోనా వైరస్. అదేంటి మహిళలని కరోనా వైరస్ రక్షించడం ఏంటి అంటారా... ఒకసారి స్టోరీ లోకి వెళితే అది మీకే అర్థమవుతుంది.

 

 

 మహిళలపై రోజురోజుకు ప్రతి చోట లైంగిక వేధింపులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కఠిన చట్టాలు తీసుకు వచ్చిన మహిళలపై లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదు. కానీ ఎఫెక్ట్  మహిళలపై అత్యాచారాలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు కామాంధులు. కామాంధుల నుంచి తప్పించుకోవడానికి కరోనా  వైరస్ సోకిందని తెలివిగా తప్పించుకుంటున్నారు మహిళలు. ఇలాంటి ఘటనే జరిగింది ఇక్కడ. ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగ మహిళ ఒంటరిగా ఉండటం చూసి కామం తో ఊగిపోయాడు. అత్యాచారం చేయాలని మీద పడిపోయాడు. 

 

 

 ఇంతలో భయపడకుండా ధైర్యంతో తెలివిగా ఆలోచించిన  మహిళ... చాలా అతని నుండి  బయటపడింది. తనకు కరోనా వైరస్ సోకినదని... అందుకే ఇక్కడ నిర్బంధించారు అంటూ అబద్ధం చెప్పింది మహిళ. అంతేకాకుండా  కరోనా  వైరస్ వచ్చినట్టుగానే దగ్గుతున్నట్టు నటించింది. దీంతో ఆ మహిళ పై ఆత్యాచారం చేయాలనుకున్న దొంగ కాస్త కరోనా  వైరస్తో హడలిపోయి అక్కడినుంచి నగదును తీసుకొని పారిపోయాడు. దీంతో ఆ మహిళదొంగ బారి నుంచి బయటపడింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ దొంగను పట్టుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: