మాజీ పిఎస్ శ్రీనివాస్ ను పట్టుకుంటే సంచలన విషయాలు బయటకు వస్తాయా ?  అవుననే సమాచారం వస్తోంది. ఎందుకంటే శ్రీనివాస్ గతంలో పిఎస్ గా పనిచేసింది ఎవరి దగ్గరో కాదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు దగ్గరే కావటంతో  సంచలన విషయాలు బయటపడతాయని అనుకుంటున్నారు.  చంద్రబాబు సిఎంగా ఉన్న ఐదేళ్ళు  ఈ పిఎస్సే చక్రం తిప్పాడు. ఇటు పార్టీలోనే కాదు అటు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా శ్రీనివాస్ మాటకు ఎదురన్నదే లేకుండా పోయింది.

 

ప్రభుత్వంలోని వారికి పార్టీ నేతలకు కూడా చంద్రబాబు పూర్తిగా అందుబాటులో లేకపోవటంతో  చాలామందికి పిఎస్సే దిక్కయ్యాడు. అందుకనే శ్రీనివాస్ ను కలిస్తే చాలు చంద్రబాబును కలిసినట్లే అనే ప్రచారం అప్పట్లో విపరీతంగా జరిగింది. అప్పట్లో జరిగిన ప్రచారాన్ని బట్టే శ్రీనివాస్ హవా ఏ స్ధాయిలో చెల్లుబాటైందో అందరికీ అర్ధమైపోతోంది. అందుకనే పిఎస్ ఇంట్లో ఐటి ఉన్నతాధికారులు దాడి చేసిన విషయం బయటపడగానే టిడిపిలో సంచలనం మొదలైంది.

 

ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం చంద్రబాబుకు శ్రీనివాసే కళ్ళు, చెవులుగా వ్యవహరించారు. కాబట్టి చంద్రబాబు లేదా పుత్రరత్నం నారా లోకేష్ కు సంబంధించిన చాలా వ్యవహారాల్లో శ్రీనివాస్ ప్రమేయం తప్పక ఉంటుందని అనుకుంటున్నారు. సరే వాళ్ళిద్దరి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించినఈ మాజీ  పిఎస్ సొంత వ్యవహారాలను చక్కబెట్టుకోకుండా ఎలాగుంటారు ? జరుగుతున్న ప్రచారం ప్రకారం విజయవాడ, హైదరాబాద్ లో చాలా ఫ్లాట్లు ఉన్నాయట. అమరావతిలో కూడా పెద్ద ఎత్తున భూ పత్రాలు దొరికాయని సమాచారం.

 

ఈ విషయంలో వచ్చిన ఆరోపణలపైనే ఢిల్లీ నుండి ఐటి అధికారులు విజయవాడ అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా శ్రీనివాస్ ఇంటిపై దాడి చేశారు.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఐటి అధికారులు తమతో పాటు ఢిల్లీ నుండి సిఆర్పిఎఫ్ పోలీసులను కూడా వెంట తెచ్చుకోవటం. అంటే లోకల్ పోలీసులను కూడా ఐటి అధికారులు నమ్మలేదనే అనుకోవాలి. 24 గంటలుగా జరుగుతున్న సోదాల్లో వందల కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల పత్రాలు బయటపడ్డాయనే ప్రచారం జరుగుతోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కూడా శ్రీనివాస్ హస్తం ఉందట. పిఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ దగ్గరే వందల కోట్ల ఆస్తులు బయటపడితే ఇక....

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: