మందుబాబులు.. ఫుల్ గా ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటే.. ఒకప్పుడు ఊరు అవతల కొండల వద్ద పారె చిన్న కాలువ వద్ద చికెన్ చేసుకొని అక్కడే మందు తాగి.. డ్యాన్సులు వేసి ఎంజాయ్ చేసే వారు. అది అంత పల్లెటూరులో.. అది కూడా ఓ 20 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఆలా కాదు.. పల్లెటూరు వాళ్ళు ఏమో సిటీకి వచ్చి పబ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. 

 

సిటీ వాళ్ళు ఏమో పక్క రాష్ట్రాలకు పొయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. అవును.. ఇది నిజం. గోవాలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి గోవాకు వెళ్లడం ఒక కల. ఆ కల నెరవేర్చుకోవడం కోసం వారు ఎంతైనా చేస్తారు. గోవాకు వెళ్లి అక్కడ తాగి.. ఎంజాయ్ చెయ్యాలి అనేది మందుబాబుల కోరిక.. కానీ పాపం.. వాళ్లకు ఆ కోరిక తీరేలా లేదు.. 

 

ఎందుకంటే.. గోవా వెళ్లి మందు తాగుతూ ఎంజాయ్ చేయాలనుకునే వారికీ అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మందు రేట్లను 20% నుండి 50% నికి పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి కొత్త రేట్లు అమల్లోకి రానుండగా దీని వల్ల రాష్ట్రానికి 100 కోట్ల రూపాయిలు అదనపు ఆదాయం వస్తుంది అని ప్రభుత్వం ఆశిస్తోంది. కాగా సామాన్యుడిపై పన్నుల భారం వెయ్యకుండా ఎక్ససిజె డ్యూటీని పెంచమని ప్రభుత్వం చెబుతోంది. దీంతో గోరావ్ వెళ్ళాలి.. ఎంజాయ్ చెయ్యాలి అనుకున్న వారందరికీ గట్టి షాక్ తగిలింది. 

 

సాధారణంగా అయితే.. ఇక్కడ బీర్ బాటిల్ 120 రూపాయిలు ఉంటె అక్కడ కేవలం 75 రూపాయిలకే వస్తుంది.. ఇంకా ఫారిన్ సరుకు కూడా అక్కడ భారీగా దొరికేది. అందుకే.. ఏ రాష్ట్రం నుండి మందుబాబులు అక్కడకు వెళ్లిన పితల్లా తాగేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ మందుబాబులకు లేకుండా పోయింది. అందుకే.. ఇది ఒక్క గోవా రాష్ట్ర ప్రజలకే కాదు గోవా వెళ్లే ప్రతి మందుబాబుకు ఇది షాకింగ్ న్యూస్ ఏ. 

మరింత సమాచారం తెలుసుకోండి: