ఉపాధ్యాయులు అంటే విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా ఉండాలి. విద్యాబుద్ధులు నేర్పించాలీ... సత్ప్రవర్తనను నేర్పించాలి. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు  వేయగల అవకాశం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. అందుకే గురువు స్థానం ఎప్పుడు గొప్పదే. ఇక విద్యార్థులకు గురువు నేర్పాల్సి ముఖ్యంగా జీవిత విలువలు... ఎవరితో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి అనేది చిన్నపిల్లల స్థాయి నుంచి పెద్దఅయ్యేంత  వరకు విద్యార్థులకు నేర్పేది గురువులే. విద్యాబుద్ధులు నేర్పి సత్ప్రవర్తన నేర్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల కంటే హీనంగా ప్రవర్తిస్తే ఇక విద్యార్థులకు వారి కొత్తగా విలువలు ఏం నేర్పిస్తారు. తాజాగా ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందే సాహోపాద్యాయురాలకి  ముద్దు పెట్టాడు. ఈ ఘటన సంచలనం రేపింది. 

 


 తరగతి గదిలోనే ఓ మహిళా టీచర్లకు సహాధ్యాయులు ముద్దు పెట్టిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. విద్యార్థుల ముందే ఓ  ఉపాధ్యాయుడు బుద్ది  లేకుండా నీచంగా  ప్రవర్తించడంతో ఉపాధ్యాయురాలు తో పాటు విద్యార్థులు కూడా షాక్ తిన్నారు. రాజస్థాన్ లోని కరౌలి  గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మాయిలు ఆత్మవిశ్వాసం పెంపొందించే అంశంపై... ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సమయంలో... మొత్తం సైలెంట్ గా ఉంది.... విద్యార్థులు ఉపాధ్యాయులు చెబుతున్న మాటలను శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో అక్కడికి ఒక ఉపాధ్యాయుడు వచ్చాడు. కాగా అక్కడ ఓ  ఉపాధ్యాయురాలు తన ప్రసంగాన్ని వినిపిస్తుండగా ఇంకో ఉపాధ్యాయురాలు పక్కనే కూర్చుంది. 

 


 ఇంతలో అక్కడికి చేరుకున్న ఉపాధ్యాయుడు పక్కనే కూర్చున్న ఉపాధ్యాయురాలు చెంప మీద ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. బాలికలు తమ కాళ్ళపై తాము నిలబడేలా ఎలా ఎదగాలి ఎలా చదవాలి ఎలా ఉపాధి సాధించాలి... అనే అంశాలపై ఎంతో సీరియస్గా ఓ మహిళా టీచర్ కౌన్సెలింగ్ ఇస్తున్న సమయంలో... పక్కనే  కూర్చున్న మరో టీచర్ను అదే సమయంలో తరగతి గదిలోకి వచ్చిన ఉపాధ్యాయుడు టీచర్ కి ముద్దు పెట్టడం సంచలనంగా మారింది. ఇక ఇది చూసిన విద్యార్థులు నవ్వగా..ఆ టీచర్ ఎంతో ఇబ్బందికి గురి అయింది. కాగా ఈ ఘటనపై రాజస్థాన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి ప్రశ్నించగా వివరాలు తెలియలేదు అని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్  కావడంతో.. విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామంటూ పాఠశాల ఉన్నతాధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనపై ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: