కరోనా  వైరస్... ప్రపంచ దేశాలన్నింటికీ ప్రాణ భయంతో గజగజ వణికిస్తున్న వ్యాధి. చైనాలో ఇప్పటికే వందల మంది ప్రాణాలను బలితీసుకున్న ప్రాణాంతకమైన వైరస్.. వేల మందిని ప్రాణభయంతో బతుకు వెళ్లదీసేలా  చేస్తున్న మాయదారి వైరస్. చైనాలోని ఊహాన్  నగరంలో గుర్తించబడిన కరోనా వైరస్ ప్రస్తుతం చైనా వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పటికే వందల మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. అయితే చైనాను ప్రాణభయంతో బెంబేలెత్తించడమే కాదు ప్రపంచ దేశాలను కూడా కరోనా వైరస్ ప్రాణభయంతో వణికిస్తోంది. కరోనా  వైరస్కు ఇప్పటి వరకు సరైన విరుగుడు కూడా లేకపోవడంతో ప్రాణాలు పోవడం తథ్యం గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పేరెత్తితేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 

 

 

 ఇకపోతే కరోనా  వైరస్ భారత్లోకి కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేరళలో కరోనా  వైరస్ సోకిన మూడు కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో వైరస్ అనుమానితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా  వైరస్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. అయితే ఈ కరోనా  వైరస్ కి సరైన వాక్సిన్  లేకపోవడంతో కరోనా  వైరస్ అటాక్ చేసిన కొంత సమయం లోనే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ విరుగుడు మందు ను కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు నిమగ్నమైపోయారూ. అయితే ఆస్ట్రేలియా బృందం చేపడుతున్న పరిశోధనలు కాస్త సత్ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

 

 

 ఇండియన్ సైంటిస్ట్ డాక్టర్ వాసన్  నేతృత్వంలో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన వ్యక్తి రక్త నమూనాలను సేకరించి... ఆ వ్యక్తి రక్తం నుంచి కరోనా  వైరస్ ను వేరు చేయడంతో పాటు వైరస్ పెరుగుదలను వైద్యులు గుర్తించారు. అయితే ఈ ప్రాణాంతకమైన కరోనా  వైరస్ కు  వ్యాక్సిన్ ను మరింత మెరుగుపరిచి పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీంతో ఇప్పటికే వందల మంది ప్రాణాలను బలికొని...  ఇంకెంతో మంది ప్రాణాలకు రక్షణ లేకుండా చేసిన కరోనా వైరస్ కు త్వరలో విరుగుడు  లభిస్తుందన్న ఆశ సర్వత్రా నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: