మొన్నటి వరకు ఉల్లి  ప్రజలను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా ఉల్లిధరలు కాస్తో కూస్తో తగ్గుతున్నాయి కానీ భారీ మొత్తంలో మాత్రం తగ్గిన  దాఖలాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఉల్లి ధరలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు టమాటా ధర కూడా ఎంతో భారంగా మారి పోయింది. కిలో టమాట 70 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పలికింది. దీంతో సామాన్య ప్రజలకు ఉల్లి తో పాటు టమాటా కూడా భారంగానే మారిపోయింది అని చెప్పాలి. అయితే నిన్న మొన్నటి వరకు డిమాండ్ బాగా పెరిగి 70 రూపాయల నుంచి 80 రూపాయల వరకు ధర ఉన్న టమాటా ఇప్పుడు మాత్రం దారుణంగా పతనం అయినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట మార్కెట్లో కిలో టమాటాలు రూపాయికి అమ్మిన  కూడా ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. 

 


 దీంతో మార్కెట్ కు తీసుకువచ్చిన టమాటాలను మళ్ళీ తిరిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రైతులకు... అయితే టమాటాల దిగుబడులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో నే టమాటా కు డిమాండ్ తగ్గి ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్లు రైతులు చెబుతున్నారు. అయితే మార్కెట్ లోకి భారీగా వచ్చిన టమాటాలను కొనేందుకు ప్రజలు ఎవరూ అంతగా ఆసక్తి చూపకపోవడంతో... రైతులందరూ సాయంత్రం వరకు టమాటాలు  అమ్మెందుకు  ఎదురు చూసారు. అయితే ఎక్కువ మొత్తంలో మార్కెట్లోకి టమాటాలు రావడంతో... టమాటాలను మార్కెట్లోకి తీసుకు వచ్చిన రైతులు ఎవరు పూర్తిస్థాయిలో టమాటాలను విక్రయించలేకపోయారు. అయితే 30 కిలోల టమాటాలను కేవలం 30 రూపాయలకు కూడా కొనేందుకు ప్రజలు అంతగా మొగ్గు చూపలేదు. టమాటాలు అమ్మి  భారీగా సొమ్ము చేసుకుందామని వచ్చినా రైతులందరికీ నిరాశే ఎదురైంది అని చెప్పాలి. 

 

 చివరికి టమాటాలు సరిగా అమ్ముడు పోక పోగులుగా పోసి విక్రయించాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే టమాటా కు  భారీగా డిమాండ్ ఏర్పడి పెరుగుతున్న ధరలను చూసి తాము ఎంతగానో సంబరపడిపోయామని మంచి లాభాలు వస్తాయని ఎంతో ఆశతో ఉన్నామని కానీ.. ఇంతలోనే ఇలా జరుగుతుంది అని మాత్రం ఊహించలేకపోయాము  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టమాటా రైతులు. అయితే టమాటా ధర తగ్గినప్పటికీ అటు... ఉల్లి ధరలు మాత్రం ఇంకా కొండెక్కి కూర్చున్నాయి. సామాన్య ప్రజలకు ఉల్లిధరలు ఇంకా భారంగానే మారిపోయాయి. టమాటా ధర అయితే తగ్గింది మరి ఉల్లిధరలు ఎప్పుడు తగ్గుతాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: