ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రస్తుతం చైనా దేశాన్ని బెంబేలెత్తిస్తున్నా విషయం తెలిసిందే. ఇప్పటికీ సరైన విరుగుడు లేని కరోనా వైరస్ బారినపడి ఆరువందలకు పైగా మరణించారు ఇక 30 వేల మందికి పైగా కరోనా బారిన పడి ప్రాణభయంతో బతుకును వెళ్లదీస్తున్నారు. ఇక కరోనా  వైరస్ ముందుగా గుర్తించబడిన ఊహన్  నగరంలో అయితే పరిస్థితి మరింత భయానకంగా మారిపోయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మరి స్మశాన నిశ్శబ్దం కలిగి ఉన్నాయి. ఇక చైనాలోని వుహాన్  నగరంలోని ఆసుపత్రులన్ని  కరోనా  వైరస్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఊహన్  నగరంలో పరిస్థితి రోజు రోజుకు మరింత దారుణం గా మారిపోతుంది. 

 


 ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను బలితీసుకున్న కరోనా వైరస్  చైనా లోని ఇతర నగరాలకు వ్యాప్తి చెందకుండా  వుహాన్ నగరం స్వీయ  నిర్బంధంలో ఉంది. కరోనా  వైరస్ బారినపడి ఎవరు ప్రాణాలు కోల్పోకుండా  అక్కడి డాక్టర్లు నర్సులు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏకంగా కరోనా వైరస్ ను  గుర్తించినప్పటి నుంచి.. చైనాలోనే వైద్యులు నర్సులు హాస్పిటల్ సిబ్బంది మొత్తం కరోనా  వైరస్ బాధితులకు చికిత్స అందించడంలో నిమజ్ఞం  అయిపోయారు. కుటుంబాలను వదిలేసి మరో 24 గంటలపాటు కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇంకొంతమంది కుటుంబాన్ని వదిలేసి కరోనా  వైరస్ కు విరుగుడు మందు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. 

 

 అయితే కరోనా వైరస్ ను నివారించడానికి పోరాడుతున్న నర్సు తో ఆమె కూతురు సంభాషణ ప్రస్తుతం అందరి గుండెల్ని కలచివేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. చైనాలోని హనాన్ ప్రావిన్స్ కౌంటీలోని లీ అయాన్ అనే నర్సు   పీపుల్స్ ఆసుపత్రిలో కరోనా  వైరస్ బాధితులకు చికిత్సను అందిస్తోంది. అయితే గత పది రోజుల నుండి ఇంటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులను కలవకుండా కరోనా  వైరస్ బాధితులకు చికిత్స అందించడంలో నిమగ్నం అయిపోయింది. అయితే ఈ నర్సుకు 9 ఏళ్ల కుమార్తె ఉంది. కాగా  తల్లి ని కలవడానికి వచ్చిన కుమార్తె.. దూరం నుంచే గాల్లో  చేతులు ముందుకు చాచి... అమ్మ నేను మిస్ అవుతున్న అంటూ తెలిపింది.  అయితే కలుసుకోవడానికి నిషేధం ఉండడంతో ఆ తల్లి బిడ్డ ఇద్దరు  గాల్లోనే హాగ్ ఇచ్చుకున్నారు.  దీనికి సంబంధించిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.  అందరినీ కలిచివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: