క్రూయిజ్ షిప్.. డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్.. ఇందులో సిబ్బందితో కలిపి ఓడలో మొత్తం 3700 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం జపాన్ నిర్భంధంలో ఉన్న క్రూయిజ్ షిప్ లో విడతల వారీగా వైద్యులు పరీక్షలు జరుపుతుండగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 

 

రెండు రోజుల క్రితం 270 మంది ప్రయాణికులకు పరీక్షలు జరపగా వారిలో 10 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే నిన్నటి విడత వైద్య పరీక్షలో మొత్తం 61 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. జపాన్ ఆరోగ్య శాఖ ఈ డైమండ్ ప్రిన్స్ నౌకను 14 రోజుల పాటు నిర్భంధంలో ఉంచనుంది. 

 

ఆ తరువాత కరోనా బాధితుల పరిస్థితులను బట్టి కీలక నిర్ణయాలను ప్రకటించనున్నట్టు పేర్కొంది. అధికారులు కరోనా వైరస్ బాధితులను చికిత్స కోసం టోక్యో చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఉన్న వైద్య కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే తాజా విడతలో ఓ మంచి శుభవార్త తెలిసింది. అది ఏంటి అంటే.. డైమండ్ ప్రిన్స్ నౌకలో చిక్కుకు పోయిన మన 138 మంది భారతీయులు కరోనా వైరస్ నుండి సేఫ్ గా బయటపడ్డారు అని. 

 

నౌకలో వివిధ దేశాలకు చెందిన 2,666 మంది ప్రయాణికులు, 1,045 మంది సిబ్బంది ఉన్నారు. అందరిలో మన 138 భారతీయులు సేఫ్ అవ్వడం విశేషం. ఇంకా ఈ వైరస్ 80 ఏళ్ళ వృద్ధుడు నుండి సోకినట్టు సమాచారం. అయితే ఈ డైమండ్ ప్రిన్స్ నౌకను ఫిబ్రవరి 19వ తేదీ వరుకు నిర్బంధనలో ఉంచనుంది. 

 

ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ట్విట్టర్‌లో వెల్లడించారు... ''కరోనా వైరస్ కారణంగా యెకహోమా తీరంలో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్స్ నౌక సిబ్బందిలో 132 మంది భారతీయులు, ప్రయాణికుల్లో ఆరుగురు భారతీయులు ఉన్నారు.. టోక్యోలని భారత రాయబార కార్యాలయం తాజా సమాచారం ప్రకారం.. వీరిలో ఎవరికీ కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కాలేదు.. పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం'' అంటూ అయన ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: