ప్రతి ఏడు ఫిబ్రవరి 14 న  వచ్చే ప్రేమికుల రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులకు ఎంతో స్పెషల్. ఎంతో మంది తమ ప్రియమైన వారికి తమ మనసులో ఉన్న మాట చెప్పేందుకు  ధైర్యం చేస్తూ ఉంటారు. ఇక ఆల్రెడీ లవ్ లో ఉన్నవారు ఎక్కడికైనా వెళ్లి  మధుర జ్ఞాపకాలను పోగు చేసుకుంటారు. ఇదంతా పాశ్చాత్య దేశాల్లో మాత్రమే జరుగుతుంది... మన దేశం విషయానికి వస్తే మాత్రం ప్రేమికుల రోజున ప్రేమికులకు స్వేచ్ఛ ఉండదు.ప్రేమికుల రోజు ప్రేమికుల రోజు అంటారు గానీ.. ఆ రోజు ప్రేమికుల కనిపిస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎక్కడైనా వాలెంటైన్స్ డే ను జరుపుకోవటం   తప్పుగా భావించే వీహెచ్పీ బజరంగ్దళ్ సభ్యులు... పార్కులు పబ్లిక్ ప్రదేశాల్లో ఆడామగా కనిపిస్తే చాలు వారికి ఏకంగా పెళ్లిళ్లు సైతం చేసేస్తూ ఉంటారు. 

 

 ప్రేమికులు మామూలు రోజుల్లో ఎలా ఉన్నప్పటికీ ప్రేమికుల దినోత్సవం నాడు మాత్రం ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే  భయపడుతుంటారు. అందుకే పేరుకే ప్రేమికుల రోజు కానీ ప్రేమికులకు స్వేచ్ఛ లేనిది ఆరోజేనేమో . ఇప్పటికే ఇలా ప్రేమికుల రోజు నాడు బజరంగ్దళ్ వారి సంగతి  తెలియక పార్కులకు వెళ్ళి సరదాగా గడుపుదామని అనుకున్న ఎన్నో జంటలకు పెళ్లిళ్లు చేశారు బజరంగ్దళ్ విహెచ్పి బృందాల సభ్యులు. అయితే అలా పెళ్లి చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించినప్పటికీ.. సభ్యులు మాత్రం ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఇక తాజాగా బజరంగ్దళ్  విహెచ్పి సభ్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రేమికుల రోజున ఎవరైనా పార్కులు పబ్లిక్ ప్లేసులో కనిపిస్తే పెళ్లిళ్లు జరిపించే ఆనవాయితీకి సంఘపరివార్ స్వస్తి పలికాలని నిర్ణయించింది. 

 


 హైదరాబాద్ లో ప్రేమికుల రోజు కు వ్యతిరేకంగా బజరంగ్దళ్ విహెచ్పి పోస్టర్లను విడుదల చేశాయి. ఈ సందర్భంగా బజరంగ్ దళ్  విహెచ్పి నేతలు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14న జరిగే ప్రేమికులరోజు వ్యతిరేకిస్తున్నామని... ఫిబ్రవరి 14న పార్కులు పబ్లు వద్ద అమరవీరులకు పోస్టర్లు  ఏర్పాటు చేస్తాము అంటూ తెలిపారు. పబ్లిక్ లో కనిపించే ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేయబోమని వారు స్పష్టం చేశారు. పబ్లిక్ ప్లేస్ లో  కనిపించే ప్రేమజంట లతో అమరవీరులకు నివాళులర్పించేలా చేస్తామంటూ వీహెచ్పీ బజరంగ్దళ్ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే అన్ని పబ్ లకు పార్క్ లకు  కూడా లేఖలు పంపించామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: