ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అవసరం. ఎందుకంటే నిత్యం బ్యాంకు నుంచి డబ్బు తీస్తూ, వేస్తూ ఉంటాం. ఇంకా బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి అయితే బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి రోజు ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

 

అయితే ఈసారి కూడా అంతే.. బ్యాంకులు ఏకంగా ఒకేసారి 5 రోజులు బంద్ ప్రకటించాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్యాంక్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఇప్పటికే బ్యాంక్ యూనియన్లు జనవరి 31, ఫిబ్రవరి 1 సమ్మె చేసి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు అది చాలదు అన్నట్టు మళ్లీ బంద్ చేయనున్నట్టు బ్యాంక్ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. 

 

అది ఒక రోజు రెండు రోజులు కాదు.. ఏకంగా 3 రోజులు బంద్ చెయ్యనున్నారు. వచ్చే నెల అంటే మర్చి నెలలో రెండో వారంలో బ్యాంకులు బంద్ కానున్నట్టు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. మార్చి 11 నుండి 13 వరుకు ఈ సమ్మో జరగనుంది. అయితే బుధవారం, గురువారం, శుక్రవారం బ్యాంకు సమ్మో జరగగా.. 

 

మరోసటీ రోజు రెండో శనివారం, ఆదివారం అవ్వటం వల్ల బ్యాంకులు వరుసగా 5 రోజులు పని చేయవు.. అందుకే ఆ 5 రోజులు బ్యాంక్ కస్టమర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చు. అందుకే  బ్యాంక్ కస్టమర్లు ఈ తేదీలను ముందుగానే గుర్తు పెట్టుకొని పనులు చూసుకుంటే మంచిది. లేదు అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

 

కాగా ఈ బ్యాంకు బంద్ ఈ సంవత్సరం ఇప్పటికే రెండు సార్లు జరిగింది. జనవరి 8వ తేదీన ఒకసారి జరగగా, జనవరి 31, ఫిబ్రవరి 2వ తేదీన ఒకసారి బ్యాంక్ బంధ్ జరిగింది.. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో నెలలో మూడవసారి జరగనుంది ఈ బ్యాంక్ బంద్. ఏది ఏమైనా ఈ బంద్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: