ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది ఏదైనా ఉంది అంటే అదో కరోనా వైరస్ అనే చెప్పాలి. అలాంటి ఈ కరోనా వైరస్ ప్రస్తుతం మనుషులతో ఆడుకుంటుంది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అలాంటి ఈ వైరస్ కారణంగా చైనాలో కొన్ని వందలమంది మృతి చెందారు.. కొన్ని వేలమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. 

 

అసలు చైనాలో వుహాన్ లో పుట్టిన ఈ చెత్త వైరస్ కారణంగా ప్రజలు అల్లాడి పోతున్నారు.. ఎక్కడ వస్తుందో అని వణికిపోతున్నారు.. ఇంకా చైనాలో అయితే కొన్ని నగరాల్లో ప్రజలు బయటకు కూడా రావడంలేదు.. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ఇప్పటికే 30వేలమందికిపైగా సోకింది.. ఇంకా అలాంటిది ఈ వైరస్ పుట్టిన నగరం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. 

 

దారుణం అంటే దారుణంగా ఉంది వుహాన్ నగరం. ఈ వుహాన్ నగరంలో రోజు రోజుకు వైరస్ భారిన పడేవారి సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.. దీంతో ఆ నగరంలో ప్రజలంతా ఒకొక్కరుగా ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. వైరస్ నగరం అంత వ్యాపించడంతో అక్కడ ఉన్నవారు అంత శవాలుగా మారిపోతున్నారు. 

 

నగరం అంత డెడ్ సిటీగా మారిపోయింది. ఇంటి నుండి బయటకు వచ్చారో చాలు కరోనా బారిన పడి మృతి చెందుతున్నారు. దింతో ఇళ్ల నుండి, అపార్టుమెంట్ల నుండి ప్రజలను బయటకు రానివ్వడం లేదు అక్కడి అధికారులు. ఎంత అత్యవసర పరిస్థితి అయినా సరే ప్రజలను అడుగు కూడా బయటకు పెట్టనివ్వడం లేదు.. 

 

ప్రజలతో కళకళలాడిన వుహాన్ నాగారం ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా శ్మశానంగా మారిపోయింది. రోడ్లు అన్ని ప్రస్తుతం నిర్మానుష్యంగా మారి మృతులతో డెడ్ సిటీగా మారిపోయింది. ప్రస్తుతం వుహాన్ నగరం అంత ఖాళీ అయిపోయింది. ఎటువంటి షాపులు తెరవలేదు.. అన్ని వస్తువులను చైనా మూసి వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: