ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ వరుస షాక్ లు  ఇస్తుంది. మొన్నటికి మొన్న ఆర్టీసీ ఛార్జీలు పెంచి భారీ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..అంతకు మద్యం ధరలు పెంచి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు  తాజాగా విద్యుత్ ఛార్జీలను కూడా పెంచుతూ  మరో షాక్ ఇచ్చింది. తాజాగా విద్యుత్ చార్జీలు పెంచుతున్నట్టు కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కారు. 500 యూనిట్ల  పైబడిన విద్యుత్ వినియోగదారులకు  వర్తించేలా చార్జీలు  పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.500  యూనిట్లకు మించి  విద్యుత్ను వాడిన వారికి ఒక యూనిట్కు 9.05 నుంచి 9.95 టారిఫ్ గా  నిర్ణయించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ డిస్కంలు తీవ్ర నష్టాల్లో ఉన్నందు వల్ల విద్యుత్ ఛార్జీల పెంపు చేస్తున్నామని వెల్లడించారు. కాగా  ఐదు వందల యూనిట్లకు  మించి విద్యుత్ ను ఉపయోగిస్తే ప్రతి యూనిట్ కి  9.95 రూపాయల చొప్పున అదనంగా  చెల్లించాల్సి ఉంటుంది. 

 

 ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేసే డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయినందున...  ఈ నష్టాలను భర్తీ చేసేందుకు విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెంచిన విద్యుత్ చార్జీలతో... సామాన్య ప్రజలతో పాటు పరిశ్రమలు వ్యాపారస్తులకు కూడా ఎక్కువగా విద్యుత్ ఛార్జీల భారం పడుతుంది. కాగా ఇదే సమయంలో  వ్యవసాయదారులు బెల్లం రైతులు గ్రామీణ నర్సరీలకు 8, 353.58 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించేందుకు అంగీకారం తెలిపింది జగన్మోహన్ రెడ్డి సర్కారు. జగన్మోహన్రెడ్డి సర్కార్ పెంచిన విద్యుత్ ఛార్జీల తో సామాన్య ప్రజల పైన కాకుండా పరిశ్రమలో పైన పైన భారీగా భారం పడనుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు 8, 353, 58 సబ్సిడీని చెల్లించేందుకు జగన్ సర్కార్ అంగీకారం తెలపడంతో  గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 శాతం వ్యవసాయానికే  ఎక్కువగా సబ్సిడీ ఇవ్వనుంది  జగన్మోహన్ రెడ్డి సర్కార్ . 

 


 ఈ క్రమంలోనే 500 యూనిట్లు గృహ వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసేందుకు సర్కారు నిర్ణయించింది. కేవలం 500 యూనిట్లు పైబడిన విద్యుత్ వినియోగదారులకు మాత్రమే ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సామాన్య ప్రజలకు... 500 కంటే తక్కువ విద్యుత్ వినియోగించే వారికి... జగన్ మోహన్ రెడ్డి సర్కారు పెంచిన విద్యుత్ ఛార్జీలు వర్తించవచ్చు. తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ మరియు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలకు 2020 21 ఆర్థిక సంవత్సరానికి గాను 14, 349.07 ఆదాయం  అవసరం అవుతుందని జగన్మోహన్ రెడ్డి సర్కారు అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ చార్జీలు పెంచింది. దీంతో ఏపీ ప్రజలందరికీ భారీ షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: