మనిషి అడవుల్లో జీవించే కాలం నుండి అందమైనా మేడల్లో జీవించే స్దాయికి చేరిన తన పాత కాలం జీవనగమనాలను మరచిపోలేకుండా ఉంటున్నాడు.. నాగరికత అలవాటుపడని రోజుల్లో మాంసాహారాన్ని భుజిస్తూ వస్తున్న మానవుడు దానినే తన జీవితంలో ఓ భాగంగా చేసుకున్నాడు. కానీ క్రమక్రమంగా రోగాల దరికి చేరుకుంటూ తన ఆయు ప్రమాణాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాడు..  

 

 

ఇక ఆహారపు అలవాట్లు కూడా మానవుని జీవితాన్ని శాసిస్తున్నాయి. అవి ఎలా అంటే ప్రతి మనిషి తినే ఆహారంలో మూడు రకాలు ఉంటాయి. అవి సాత్వికాహారం, రాజసాహారం, తామసాహారం. అని చెప్పవచ్చూ.. సాత్వికాహారం అంటే పండ్లూ, కూరగాయలూ మొదలైనవి. ఇవి మనిషిలోని సత్వ గుణాన్ని పెంపొందిస్తాయి... అధికమైన ఉప్పూ, కారం, మసాలా దినుసులతో కూడిన మాంసాహారం రాజసాహారం.. ఇది రజో గుణాన్ని ప్రేరేపిస్తుంది. ఇక తామసాహారం అంటే పులుపూ, నిల్వ చేసిన పదార్థాలు, రక రకాలైన మాంసాహారాలూ. ఇవి తమో గుణాన్ని కలిగిస్తాయి.

 

 

వీటి కారణంగా మనిషికి కొన్ని గుణాలు  అలవాటు అవుతాయి.. అందులో నిర్వికారం, శాంతం, సహనం, క్షమ, భూతదయ, నిర్మోహత్వం, నిరహంకారం, అసూయ చెందక పోవడం, ఇవి సత్వగుణానికి చెందిన లక్షణాలు. ఇక రజోగుణ లక్షణాలు ఎలా ఉంటాయంటే కోరికలు, క్రోధం, మోహం, అహంకారం, అసూయ, మొదలైనవి... కామం, దురాశ, కోపం, వ్యామోహం, గర్వం, అసూయ, నిద్ర, భయం, పిరికితనం తమో గుణ లక్షణాలు. అయితే ప్రతివారిలోనూ ఈ మూడు గుణాలు ఉంటాయి..

 

 

ఇక ఒక మనిషి తన చిత్తాన్ని స్దిరంగా ఉంచుకుని ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటే ముందుగా సత్వ గుణాన్ని అలవరచుకోవాలి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానానికి సోపానంగా నిలుస్తుంది. ఇదే కాకుండా శాఖాహరం తీసుకుంటే శరీరంలో జీర్ణక్రియ చాలా త్వరగా జరుగుతుంది. అదే మాంసాహారం తీసుకుంటే జీర్ణం కావడానికి దాదాపు 36 నుంచి 60 గంటలు తీసుకుంటుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. దీంతో అనారోగ్యం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు. .

మరింత సమాచారం తెలుసుకోండి: