ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరసే. అలాంటి ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ అనే నగరంలో పుట్టింది. పుట్టిన కొన్ని రోజులకే అత్యంత వేగంగా.. దారుణంగా ఈ వైరస్ సోకుతుంది.. ప్రజలను బెదరకొడుతుంది. అయితే ఈ వైరస్ కారణంగా ఇప్పటికే దాదాపు 800 మందికిపైగా మృతి చెందారు.. 

 

30వేలమందికి పైగా ఈ వైరస్ భారిన పడ్డారు. అయితే.. అలాంటి ఈ వైరస్ ఎప్పుడైతే వుహాన్ లో పుట్టిందో.. అప్పుడే ఆ నగరాన్ని ప్రపంచానికి సంబంధం లేకుండా.. ప్రజలను ఎవరిని ఇంటి నుండి బయటకు రాకుండా ఎక్కడ వారు అక్కడే ఉండేలా కట్టుదిట్టం చేసింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ భారత్ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

 

బ్రజేశ్ మిశ్రా అనే ఓ జర్నలిస్టు ట్విట్ చేస్తూ భారత్ కు హెచ్చరిక జారీ చేశారు.. ''చైనాలోని వుహాన్ నగరానికి చెందిన ప్రజలు వారి ప్రాణాలను కాపాడాలంటూ పెద్దగా కేకలు వేస్తున్నారు. వారికీ చికిత్స అందించకుండా, సాయం చేయకుండా ఇళ్లలో పెట్టి తాళం వేశారని వాపోతున్నారు.. వుహాన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలు మాములు అయిపోయాయి.. కరోనా వైరస్ అతి తొందర్లోనే తన విశ్వరూపాన్ని చూపెట్టబోతోంది. భారత్ ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది'' అంటూ ట్విట్ చేశారు. 

 

అయితే నిజం ఏంటి అంటే? ఆ వీడియోలో ఉన్న ప్రజలు వుహాన్ నగరానికి చందిన వారే అని.. కానీ వీడియోకు ఇచ్చిన ట్యాగ్ లైన్ మాత్రం అబద్దం అని.. ప్రజలు కాపాడాలని కేకలు వెయ్యడం లేదని.. ఒకరికొకరు దైర్యం చెప్పుకుంటూ నినాదాలు చేస్తున్నారని తేలింది. ఆ ట్వీట్లకు వచ్చిన రిప్లై లో కూడా.. అబద్దాలను వ్యాప్తి చెయ్యద్దు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: