దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 8వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీ  ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆప్  పార్టీ ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బిజెపి పార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేశాయి. ఇక నేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు పర్వం కొనసాగుతోంది. ఇక  అభ్యర్థుల భవితవ్యం దాదాపు తేలిపోయింది. బిజెపి పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చి చక్రం తిప్పుతున్నప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం సత్తా చాట లేక చతికిలబడి పోయింది.

 

 

 మరోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్  పార్టీ బీజేపీని చీపురుతో  ఊడ్చేసింది అనే చెప్పాలి. మొదటినుంచి అత్యధిక స్థానాలు మెజారిటీ లో కొనసాగుతూ ఆప్ నేతల్లో ఎంతగానో ఉత్సాహాన్ని నింపింది.. ఇక అన్ని స్థానాల్లో  అత్యధిక మెజార్టీ లో కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దాదాపు యాభై ఎనిమిది స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. ఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు. కేజ్రీవాల్ మంత్రులు కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు నేతలు అందరూ సంబరాలకు సిద్ధమయ్యారు,. 

 

 అటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా విజయోత్సాహం లోనే ఉన్నారు.. అయితే కార్యకర్తలు నేతలు కొందరు ఆప్  పార్టీ ఘన విజయం సాధించడంపై సంబరాలకు సిద్ధమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవ లో భాగంగా టపాసులు కాల్చవద్దు అంటూ పార్టీ కార్యకర్తలకు ఆదేశించారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. టపాసులు కాల్చకుండా స్వీట్లు పంపిణీ చేయండి అని కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీలోని వాయు కాలుష్యం నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారరూ. కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఆప కార్యకర్తలు పటాసులు పేల్చటం  లేదు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడానికి బదులు బెలూన్లు గాల్లోకి వదులుతూ  స్వీట్లు పంచుకుంటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆప్ కార్యకర్తలు. ఈ విజయంతో కేజ్రీవాల్ హ్యాట్రిక్  సాధించినట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: