ఈ రోజు విడుదలైన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కేజ్రివాల్ ఆప్ పార్టీ తప్ప చూపించండి. మరోసారి హస్తినలో తిరుగులేదు అని నిరూపించింది.ఈ ఫలితాలలో ఆప్  పార్టీ బీజేపీని చిత్తుగా ఓడించింది. మొదటినుంచి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో మెజారిటీ సాధించి దూసుకుపోతోంది కేజ్రీవాల్ పార్టీ. గత రెండు అసెంబ్లీ ఎలక్షన్ ల నుంచి బిజెపి పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ... హస్తిన ప్రజలు మాత్రం కేవలం కేజ్రీవాల్ పై నమ్మకం ఉంచి ఆప్ పార్టీ కి పట్టం కడుతున్నారు. ఇక ఈ సారి కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ... ప్రస్తుతం కేజ్రీవాల్ పైన నమ్మకం ఉంచారు. మరోసారి కేజ్రీవాల్ కే పట్టంకట్టి  భారీ మెజార్టీ అందించారు. 

 


 అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు దిశగా భారీ మెజారిటీ స్థానాల్లో దూసుకుపోతున్న విషయం పై బిజెపి ఎంపీ రమేష్ స్పందించారు. కేజ్రీవాల్  హస్తిన ప్రజలకు ఇచ్చిన హామీలు కారణంగానే కేజ్రీవాల్ కి విజయం సాధించారు అని ఆయన వ్యాఖ్యానించారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ని వినియోగిస్తే... ఎవరు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు హామీలు ఇచ్చిందని... అయితే ఆప్  ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రకటన ఢిల్లీ పేదలపై ఎంతగానో ప్రభావం చూపిన ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించడంలో తమ పార్టీ అభ్యర్థులు వెనకబడి పోయారూ  అంటూ రమేష్ విమర్శించారు.

 


 కేంద్ర తీసుకొచ్చిన పథకాలన్నింటినీ ఢిల్లీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ కార్యకర్తలు సమర్థవంతంగా పని చేస్తే.. తమ  పార్టీ మంచి ఫలితాలను రాబట్టగలిగేదని...  కానీ అలా జరగలేదని  అందుకే కేజ్రీవాల్ వైపు ఢిల్లీ ప్రజలు ఆసక్తి  చూపారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే మొదటి నుంచి భారీ మెజారిటీలు సొంతం చేసుకున్న ఆప్  పార్టీ...  ఢిల్లీ వీధుల్లో నుంచి కమలాన్ని ఊడ్చేసిన  విషయం తెలుసిందే. ఆ పార్టీకి ఇంతకు ఇంతకు మెజారిటీ పెరుగుతూ వస్తుంది. కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు చివరికి మరోసారి నిరాశే ఎదురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: