గత ఆరేళ్ళు గా దేశ ప్రజలు ఎక్కువగా చూస్తున్న పరిణామం ఏదైనా ఉందీ అంటే దేశభక్తి. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో పాపం ఎవరికి నిరూపించుకునే అవకాశం రాలేదు గాని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కువగా వచ్చింది. అసలు మేము ఇక్కడే పుట్టామా అనే పరిస్థితికి బిజెపియేతర పార్టీలకు మద్దతు ఇచ్చిన ప్రజలు వచ్చారు అంటే ఏ పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశ రాజకీయాలను గమనిస్తున్న వారికి ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దేశం కోసం ప్రాణాలు కోల్పోయారో లేదో గాని ప్రజల్లోనే చచ్చిపోయారు, రాజీవ్, ఇందిరా.


అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా దేశ భక్తి గురించి చెప్పిన పాపాన పోలేదు. కాని దేశ భక్తి ఉందని చెప్పుకుంటూ దేశంలో మెజారిటి వర్గంగా ఉన్న హిందుత్వ ఓటు బ్యాంకు ని తమ వైపుకి తిప్పుకోవడానికి బిజెపి వేసిన ఎత్తులు అన్నీ ఇన్ని కావు. దేశభక్తి అంటూనే బిజెపి పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో శాంతి అంటూ అక్కడ చెయ్యాల్సింది అంతా చేస్తూ వస్తుంది.


పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిజెపి రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. అధికారంలోకి వస్తాం అనుకున్న ఢిల్లీలో షాక్ తగిలింది. ఇప్పుడు బిజెపి వైఖరి ఏ విధంగా ఉంటుంది. చెప్పిందే చెప్తే వినేవాడికి చెవుల్లో రక్తం అన్నట్టు... దేశభక్తిని కూడా జనాలకు బోర్ కొట్టించారు మోడిషా. ఇక ఇప్పుడు దానికి కాలం చెల్లింది. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో బిజెపి వెనక్కు తగ్గకపోతే మరికొన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం ఖాయం. త్వరలో బెంగాల్, బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి.
 

కేరళలో కూడా త్వరలోనే జరగనున్నాయి. కాబట్టి బిజెపి అభివృద్ధి లేదా తాము చేసిన పనులు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బిజెపి చెప్పే కబుర్లను కేజ్రివాల్ చక్కగా తిప్పి కొట్టారు. నేను చేసింది ఇదీ అంటూ ప్రజల్లోకి వెళ్ళారు గెలిచారు. మరి బిజెపి ఎం చూపిస్తుందో చేసినవి...? ఏది ఎలా ఉన్నా ఈ ఫలితాలు మాత్రం బిజెపిని మానసికంగా చంపేయడంతో ఆ పార్టీ కక్కలేక మింగలేక చస్తుంది.
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: