ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా..తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్సాహం తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు తగిన ప్రణాళికలు వేస్తూ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తూనే ఉన్నారు. పార్టీ శ్రేణులు ఎక్కడా అధైర్యపడకుండా ధైర్యం నూరిపోస్తున్నాడు. ఏదో ఒక అంశంతో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ తమ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ముందుకు వెళ్తున్నాడు. సుమారు 50 రోజులుగా అమరావతి ప్రాంతంలో మూడు  రాజధానులు వ్యతిరేకంగా దీక్షలు, ధర్నాలు చేయించిన బాబు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతికేత తీసుకొచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం... వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం, మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం మొండి పట్టుదలతో ఉండడంతో ఈ ఉద్యమం మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది.


 గత ఐదు రోజులుగా అమరావతి విషయం పై చంద్రబాబు స్పందించకుండా మౌనంగా ఉంటున్నారు. అయితే త్వరలో ఏపీ లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి గట్టెక్కాలంటే ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి బస్సు యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా 175 నియోజకవర్గాల్లోనూ 45 రోజుల్లో యాత్ర పూర్తి చేయాలనే ప్రణాలికను వేసుకున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


 ఈ బస్సు యాత్రను  ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ ముగించాలి అనే విషయంపై టిడిపి ఇంకా క్లారిటికి రాలేనట్టుగా తెల్సుతోంది. ఈ బస్సు యాత్రలో ఏపీఏలో నెలకొన్న ప్రభుత్వ వైఫల్యాలు, ఇసుక కొరత, పెన్షన్లు రద్దు చేయడం తదితర విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: