ప్రస్తుతం చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతూ వేల సంఖ్యలో ప్రాణాలు బలికొన్న వైరస్ కరోనా . ఈ వైరస్ ప్రస్తుతం చైనా లో అతి వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమందిని ప్రాణభయంతో పరుగులు వణికిస్తుంది . ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి వెయ్యి మందికి పైగా చనిపోగా 40 వేల మందికి పైగా ఈ వైరస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక ప్రపంచ దేశాలు కూడా ఈ వైరస్ పేరెత్తితేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే అన్ని దేశాలు ముందుజాగ్రత్త చర్యలు కూడా చేపడతున్నాయి. ఇకపోతే కరోనా  వైరస్ విజృంబిస్తున్న  నేపథ్యంలో కరోనా  వైరస్ కు సంబంధించి కొన్ని వార్తలు కూడా ప్రచారం  అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చికెన్ తినొద్దు అని... చికెన్ తినడం వల్ల కరోనా  వైరస్ సోకుతుంది అంటూ వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. 

 

 

 అయితే  ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కోళ్లకు  ప్రవేశించిందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో పుకార్లు రావడంతో  ఈ అధికారులకు రంగం లోకి దిగారు . అయితే కోళ్లకు కరోనా  వైరస్ సోకుతుంది అని ఇప్పుడు వరకు ఎక్కడా నిరూపితం కాలేదు అంటూ అధికారులు తెలిపారు. అయితే తణుకు  నియోజకవర్గంలో కోళ్ళకి అంతుచిక్కని వ్యాధి సోకి భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఏదో వైరస్ కారణంగా కోళ్లు మృత్యువాత పడడంతో తణుకు ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చికెన్ మటన్ అమ్మకాలపై వారం రోజుల పాటు నిషేధం విధించారు అధికారులు. 

 

 

 ఈ క్రమంలోనే తణుకులో పరిస్థితి ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పరిస్థితిని సమీక్షించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృశ్య వారం రోజులపాటు చికెన్ మటన్ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ఆయన మీడియా వేదికగా వెల్లడించారు. అయితే వైరస్ బారిన పడి చనిపోయిన కోళ్లను  కాలువలు రోడ్ల పక్కన పడేయకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అయితే కోళ్లకు వచ్చిన వైరస్ కు కరోనా  వైరస్ కు ఎలాంటి సంబంధం లేదని అధికారులు తేల్చి చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: