ప్రతి మనిషి జీవితంలో కెరియర్ ఎంత ఇంపార్టెంటో లవ్ కూడా అంతే ఇంపార్టెంట్. లవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో...  కెరియర్ కూడా అంత ఇంపార్టెంటే. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగితేనే జీవితం హాయిగా సాగిపోతుంది. ఈ రెండింటిలో ఏది సరిగా లేకున్నా జీవితంలో ఇబ్బందులు తప్పవు. అయితే ఒకప్పటి జనరేషన్ లో కూడా  ప్రేమలు ఉన్నాయి.. కానీ పెద్దలకు భయపడి చాలామంది పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. కానీ నేటి జనరేషన్ లో మాత్రం ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లిలు  చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఇక అటు పెద్దలు కూడా ప్రేమ పెళ్లిళ్లు చాలా లైట్ గా తీసుకుంటున్నారు. పిల్లలు ప్రేమించాము  అని చెబితే... పిల్లల ఆనందం కంటే ఏమీ ఎక్కువ కాదని భావించి పిల్లల పెళ్లిళ్లకు పెళ్లి  చేస్తున్నారు. ప్రేమంటే..ఎంతో మధుర జ్ఞాపకం... ఎవరికీ తెలియకుండా  రెండు మనసులు గుసగుసలాడడం...మాటలతో కాకుండా  కళ్ళతోనే  మాట్లాడుకోవడం... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమలోని మధుర జ్ఞాపకాల  గురించి ఎంత చెప్పినా తక్కువే. 

 

 

 అయితే జీవితంలో ప్రేమ అనేది ఎంత ముఖ్యమో ప్రేమతో అటు  కెరియర్ కూడా అంతే ముఖ్యం. ప్రేమించడం ఏముంది అందరూ ప్రేమిస్తారు... కానీ సక్సెస్ ఫుల్ కెరియర్  సాధించి ప్రేమను గెలవడం చాలా గొప్ప. ప్రస్తుతం జనేరేషన్ లో  క్లారిటీ కొంత మందికి ఉంది... చాలా  మందికి ఉండటం లేదు. లైఫ్ లో సెట్ అయిన తర్వాత ప్రేమ జోలికి వెళ్తే... ఇంకొంతమంది తెలిసి తెలియని వయసు లోనే ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అయితే ఒక్కసారి ప్రేమ పుట్టింది అంటే ఎన్నో జ్ఞాపకాలను మధుర స్మృతులను మిగులుస్తుంది  ప్రేమ...ఆ  ప్రేమ సుఖాంతం అయితే పర్లేదు కానీ... విడిపోతే మాత్రం... ఆ బాధ మాటల్లో వర్ణించలేనిది చేతల్లో చెప్పలేనిది. ఒకవేళ ప్రేమలో విజయం సాధించి కెరీర్ లో మాత్రం విజయం సాధించలేకపోతే... జీవితంలో ఎన్నో ఇబ్బందులు తప్పవు. 

 

 

 కెరియర్ లో సక్సెస్ అయి ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ జీవితం ఎంతో మధురం అని ఇప్పటికే ఎంతోమంది మేధావులు అనుభవజ్ఞులు కూడా చెప్తూ ఉంటారు. నేటితరం ప్రేమలో మాత్రం ఎక్కడా కెరియర్  పైన దృష్టి పెట్టండం లేదు.  చిన్న వయసు నుంచే ప్రేమ దోమ అంటూ తిరగడం ఆ తర్వాత బ్రేకప్ చేసుకొని పిచ్చి వాల్లలా  మారడం లాంటివి  చేస్తున్నారు. కొంతమంది ప్రేమ విఫలం అయిందని ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకమే  మిగులుతుంది. అందుకే ముందుగా కెరీర్ పైనే దృష్టి పెట్టి విజయం సాధిస్తే ఆ తర్వాత ప్రేమలో  కచ్చితంగా విజయం సాధించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: