ప్రేమ ప్రేమ ప్రేమ... నేటితరం జనరేషన్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అప్పటి తరంలో అయితే ప్రేమించే వయస్సు వచ్చాక ప్రేమించి... ఒక హద్దులోనే  ప్రేమించుకునే వారు... ఇప్పుడు మాత్రం ప్రేమకు హద్దులు లేకుండా పోయింది. హద్దులు మీరి  పోతున్నాయి నేటితరం ప్రేమలు. స్కూల్ డేస్ నుంచే  మాయదారి ప్రేమలు  మొదలవుతున్నాయి. సినిమాల ప్రభావమా... సమాజంలో జరుగుతున్న సంఘటనల ప్రభావం ఇంకా ఏదైనా కావచ్చు కానీ పాఠశాల నుంచి మొదలవుతున్న ప్రేమలు కాస్త ఎక్కడికో దారితీస్తున్నాయి.  సమాజాన్ని ఎటువైపో నడిపిస్తున్నాయి. అప్పుడప్పుడే రెక్కలు వస్తున్న సమయంలో ప్రేమ దోమ అంటూ  ఒకరిపట్ల ఒకరు ఆకర్షణ కు గురవుతున్నారు. చిన్న వయసులోనే ప్రేమ పుట్టింది ఆ తర్వాత అయినా ఒక హద్దు అదుపు లో ఉంటారనుకుంటే అది లేదు. 

 

 నేటితరం ప్రేమలో నిజాయితీ గా ప్రేమించడం కంటే పార్కుల్లో చుట్టూ తిరిగి... ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా కనిపిస్తున్నది. సినిమాలు షికార్లు అంటూ చక్కర్లు కొట్టడం..ప్రేమ ముసుగులో బరితెగించి తిరగడం లాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో తెరమీదికి కూడా వచ్చాయి. పబ్లిక్ పార్క్ లో అయితే మొత్తం లవర్స్ తో నిండి పోతాయి. కేవలం అక్కడికొచ్చి మాట్లాడుకుంటారు అంటే అది లేదు. వాళ్లు ఉన్నది పబ్లిక్ ప్లేస్ అని కూడా మరుచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేటితరం ప్రేమలు కాస్తా మరింత నీచంగా  మారిపోతున్నాయి. అయితే ప్రేమలో పడిన వాళ్లు ఇలా పార్కులో చుట్టూ తిరగడం చేస్తే... వన్ సైడ్ లవర్స్  మాత్రం మరింత బరితెగిస్తున్నారు. 

 

 

 తమకు నచ్చిన అమ్మాయిని ప్రేమించడం... ఒప్పుకోకపోతే బెదిరించడం... వద్దు అంటే ఆసిడ్ పోయడం... మొండికేస్తే మర్డర్ చేయడం లాంటి ఘటనలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ప్రేమ అన్నప్పుడు అబ్బాయికి ప్రేమించే హక్కు ఎంత ఉంటుందో అటు అమ్మాయికి కూడా అంతే ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం తాము  ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోవడంతో సైకోలు గా మారిపోయి యాసిడ్ దాడులకు పాల్పడడం విచక్షణరహితంగా హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో నేటి తరం ప్రేమలు కాస్త పూర్తిగా గాడి తప్పి పోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: