ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన దాదాపుగా సక్సెస్ అనే మాట అధికార పార్టీ నేతల నోట వినపడుతుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన జగన్ రాజధాని సహా అనేక విషయాల్లో కేంద్రం అంగీకారం తీసుకున్నారని, త్వరలో హైకోర్ట్ ని తరలించడం దాదాపుగా ఖాయమనే వ్యాఖ్యాలు వైసీపీ నేతల నుంచి ఎక్కువగా వినపడుతున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అన్నట్టు బిజెపి, వైసీపీ పొత్తు పెట్టుకోవడమే కాకుండా, ఎన్డియే వైసీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. 

 

ఇది నిజం కాదని అధికార పార్టీ నేతలు చెప్పారు కూడా. బిజెపి కూడా ఈ ప్రచారాన్ని ఇప్పటికే ఖండించి స్పష్టత కూడా ఇచ్చేసింది. ఇది పక్కన పెడితే ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మరో కీలక అడుగు వేసారని సమాచారం. ఒక అధికారి విషయంలో కేంద్ర హోం శాఖ మద్దతు కోసం ఆయన ప్రయత్నాలు చేసారని, అవి దాదాపుగా ఫలించాయి అనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కొందరు అధికారుల కోసం జగన్ గట్టిగా ప్రయత్నాలు చేసారు. 

 

వారిలో కొందరు సీనియర్ ఐపిఎస్, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. తన తండ్రి హయాంలో పని చేసిన అధికారులను ఆయన తన ప్రభుత్వంలోకి తీసుకోవాలని భావించారు. వారిలో రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్రను ఎంపిక చేసుకోవాలని జగన్ భావించారు. తెలంగాణాలో ఉన్న ఆయన్ను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసారు. దీనికి కేంద్రం అంగీకారం తెలపలేదు. ఇప్పుడు ఆయన కేంద్రం అంగీకారం తీసుకున్నట్టు సమాచారం. కొంత కాలం వేచి చూసిన స్టీఫెన్ రవీంద్ర మళ్ళీ తన విధుల్లో చేరారు. ఇప్పుడు మళ్ళీ జగన్ అమిత్ షా తో జరిగిన భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకురాగా అమిత్ షా అంగీకారం తెలిపారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: