ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడో సారి అరవింద్ కేజ్రివాల్ ప్రమాణ స్వీకారం చేసారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న రాం లీలా మైదానంలో అంగరంగ వైభవంగా ధన్యవాద్ ఢిల్లీ పేరుతో ప్రమాణ స్వీకారం మహోత్సవ౦ పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ అరవింద్ కేజ్రివాల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక మంత్రులుగా మానీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వేకారం చేసారు. 

 

కైలేష్ గెహ్లాట్ సహా మరో ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున పారిశుధ్య కార్మికులు కూడా హాజరయ్యారు. ఇక అరవింద్ కేజ్రివాల్ ప్రస్తానం చూస్తే, 1968 హర్యానాలోని మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కేజ్రివాల్, ఐఐటి ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసారు. ఆ తర్వాత జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం కూడా చేసారు ఆయన. ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత టాటా స్టీల్ లో కొంత కాలం పాటు పని చేసారు. ఆ తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కి ఆయన ఎంపిక అయ్యారు. 

 

ఢిల్లీ ఐటి కార్యాలయంలో జాయింట్ కమీషనర్ గా ఉద్యోగం చేసారు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూనే 99లో పరివర్తాన్ పేరుతో సామాజిక ఉద్యమం మొదలుపెట్టారు ఆయన. జనలోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి పోరాటం చేసారు. ఆ తర్వాత ఆయనతో విభేదించి 2012 లో అమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013 లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పని చేసిన వారిలో కేజ్రివాల్ అందరికంటే చిన్నవాడు. ఇక ఆ తర్వాత 2015 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 67 సీట్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: