జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మళ్లీ అధికారం దక్కే అవకాశం, ఆశలు అసలు కాంగ్రెస్ లో కనిపించడం లేదు. దీనికి కారణం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి దిగజారి పోతుండడం, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తడంతో ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం కూడా దక్కించుకోలేక చతికిలపడడం ఇవన్నీ ఆ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అందుకే ఇకపై పార్టీని పరుగులు పెట్టించాలని చూస్తోంది. ఆ దిశగానే పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే యువరక్తంతో పార్టీని నింపాలని చూస్తోంది. 


కాంగ్రెస్ లో ఎక్కువ మంది సీనియర్ నాయకులు ఉండడం, ప్రస్తుత రాజకీయాలలో వారి సలహాలు, సూచనలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఇవన్నీ లోపాలుగా గుర్తించిన కాంగ్రెస్ ఇకపై యువ నాయకత్వం పైన దృష్టి పెట్టాలని చూస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపించాలని సోనియాగాంధీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆమెతో పాటు మరికొందరు యువ నాయకులను రాజ్యసభకు పంపించడం ద్వారా కాంగ్రెస్ లో మళ్ళీ పునర్వైభవం వస్తుందని బలంగా నమ్ముతోంది. ప్రస్తుతం అంబికా సోనీ, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ ల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ స్థానంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లోని యువ నాయకులతో రాజ్యసభ స్థానాలు భర్తీ చేయాలని చూస్తోంది. 


కాంగ్రెస్ అంటేనే సీనియర్ నాయకుల హడావుడి ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఆ ఫార్ములా వర్కవుట్ కాకపోవడంతోనే  సీనియర్ నాయకులు ఎప్పుడూ కాంగ్రెస్ లో పెద్దపీట వేస్తారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని తప్పించి యువ నాయకులతో పదవులు భర్తీ చేపడితే  పూర్వవైభవం వస్తుందని బలంగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పొలిటికల్ గా మరింత యాక్టివ్ అయితే పార్టీకి కొత్త ఊపు వస్తుందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: