నేటికాలంలో ప్రజాస్వామ్య వ్యవస్ద కూని అవుతున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా సమాజంలో దోపిడీ వున్నంత కాలం దానికి గురి అయ్యేవారు నిరంతరం ఏదో ఒక రూపంలో ప్రతిఘటిస్తూనే వుంటారు.. అయినా ఎక్కడ మార్పు అనేది కలుగదు. దోపిడి చేసేవాడు చేస్తూనే ఉంటాడు, మోసపోయేవాడు మోసపోతూనే ఉంటాడు.. ఇకపోతే రైతే రాజు అని అంటారు కానీ, ప్రస్తుతం రైతే పేదవానిగా మిగిలిపోతున్నాడు..

 

 

ఇదే కాకుండా చాలావరకు నిజమైన రైతుకు అందవలసిన ప్రభుత్వపధకాలు అందడం లేదు.. రైతువిషయంలో జరుగుతున్న దోపిడి మాటల్లో చెప్పలేనిదనే అభిప్రాయం చాలా చోట్ల వెల్లడవుతుంది.. ఇదే కాకుండా ఆత్మహత్యలు, మరణాల విషయంలో రైతుకు అన్యాయమే జరుగుతుందట.. ఇక అసలు నిజమైన రైతు ఎవరు.. నిజానికి మన రాష్ట్రాల్లో ఎంతమంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు అనే లెక్కలు ఉన్నాయా..? ఉంటే వాటిలో ఎంతమందికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. అనే విషయాలు పక్కాగా బయటకు రావడం లేదు.

 

 

ఇకపోతే ఎక్కడో ఒకతను మరణిస్తే రైతు ఆత్మహత్య అంటూ ప్రచారం జరుగుతుంది.. అంతే కాకుండా అప్పుల బాధతో, వేసిన పంట నష్టాల పాలవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని విసృత ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం అనే విషయాన్ని ఎవరు గ్రహించరు.. ఇక ఈ మధ్యకాలంలో జరిగిన ఓ ఘటనలో నిజమైన రైతుకు ఎలా అన్యాయం జరుగుతుందో వివరంగా తెలిపారు. అదేమంటే కర్నూలు జిల్లా, ఆత్మకూరు మండలం, శ్రీపతిరావుపేటకు చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు… ఇదీ వార్త..

 

 

అతనికి అప్పులు ఎందుకయ్యాయంటే. తెలుగుదేశం హయాంలో కోటిన్నర రూపాయల సీసీ రోడ్ల కంట్రాక్టు పనులు తీసుకున్నాడు, ప్రభుత్వం మారింది… 30 లక్షల మేరకు బిల్లులు రావాలి, రావడం లేదు, అప్పులు ఇచ్చినవాళ్ల బాధ భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు… ఇదీ అసలు కథ… మరి రాసింది ఏమిటంటే..?  బిల్లులు రాక రైతు ఆత్మహత్య..! ఇదీ శీర్షిక…

 

 

ఇక్కడ తన ఆత్మహత్యకు కారణం పంటనష్టాలు కాదు, వ్యవసాయం కాదు… తను ఓ కంట్రాక్టర్… అంతే… బతుకుబండి లాగలేక, నమ్ముకున్న పొలం ఆదుకోక, కుటుంబ ఖర్చులు పెరిగి, అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడిన బక్కరైతుల జాబితాలోకి తను ఎలా వస్తాడు..? ఎలాగూ ప్రధాన స్రవంతి మీడియా రైతుల ఆత్మహత్యల్ని వార్తలుగా గుర్తించడం ఏనాడో మానేసింది…

 

 

ఇదుగో, రాస్తేనేమో ఇలా నిజమైన రైతులకు అన్యాయం జరిగేలా రాస్తుంది.. మరి ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అయితే ఇప్పటికే గడ్దుపరిస్దితులను ఎదుర్కొంటున్న రైతులు రానున్న కాలంలో కనుమరుగైతే ప్రజల పరిస్దితి ఏంటి.. ? ఏం తిని బ్రతుకుతారు..? అనే విషయాలను ఆలోచించి తగిన విధంగా రైతులను కాపాడుకోవలసిన అవసరం ప్రభుత్వాలకు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట..  

మరింత సమాచారం తెలుసుకోండి: