చైనాలో కరోనా వైరస్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తుంటే హృదయం ద్రవించుకుపోతుంది.. పగవారికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని అనుకుంటారు.. ఇకపోతే ప్రజల పరిస్దితే ఇలా ఉందంటే, వారికి సేవచేస్తున్న వైద్యుల పరిస్దితి, నర్సుల పరిస్దితి చాలా దారుణంగా ఉంది. ఇక కరోనా వైరస్ బాదితుల దగ్గరకు వెళ్లాలంటే వారికి ఒంట్లో వణుకు వస్తుందట.

 

 

ఇలాంటి పరిస్దితిని ఎదుర్కొటున్న  ఓ నర్స్ వేదన మామూలుగా లేదు. ఆమెపేరు లియూ..  ఆ హాస్పిటల్ గదుల్లోకి వెళ్లాలంటే వణుకు… ఎంత దారుణమైన ఫ్రస్ట్రేషన్ అంటే… బెడ్ దగ్గరకు వెళ్లినప్పుడు ఊపిరి బిగబట్టుకుంటున్నది… మాట్లాడేందుకు నోరు తెరుచుకోవడం లేదు… మెల్లిగా ఓ పక్కకు వచ్చి,  బలవంతంగా ఊపిరి తీసుకుని, మళ్లీ బెడ్ దగ్గరకు వెళ్తున్నది..

 

 

ఇలా ఎందుకంటే ఆ పిశాచి ఎక్కడ అంటుకుంటుందోననే భయం… కరోనా వైరస్ రేకెత్తిస్తున్న భయోత్పాత స్థితికి ఇంతకుమించిన ఉదాహరణ ఏముంది..? ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటంటే.. మరో నర్స్ పేరు వూ.. ఆమె మూడు వారాల నుంచి ఇంటికి వెళ్లడం లేదట.. హాస్పిటల్ దగ్గరలోని ఓ హోటల్‌లో ఉంటున్నదట.. కారణం ఏంటంటే, పొరపాటున కూడా తనతోపాటు ఆ వైరస్ తన ఇంటిదాకా రావొద్దని..! ముందుగానే తన రెండేళ్ల పాప విషయంలో భర్తకు తగిన జాగ్రత్తలు చెప్పేసి, వచ్చేసిందట..

 

 

అప్పటి నుండి మళ్లీ ఇంటికి పోవడం లేదట. ఇలా తీసుకుంటే కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న ప్రతి వారిది ఇదే పరిస్దితి. ఇంతే కాకుండా వ్యాధి వ్యాప్తి నిరోధక, చికిత్సకు పనిచేస్తున్న వేలాది మంది అలిసిపోతున్నారు.. రోగుల సంఖ్య అధికంగా ఉండటం, తమకూ ఈ వ్యాధి ఎక్కడ సోకుతుందో అని మానసికంగా, శారీరకంగా డీలాపడిపోతున్నారట.

 

 

ఇలా చాలామంది ఇళ్లకు వెళ్లడం లేదు.. తినీతినక, నిద్రపోక, చివరకు స్నానం చేసే టైం కూడా దొరకడం లేదు.. చాలామంది చెప్పరాని విధంగా కష్టాలు అనుభవిస్తున్నారట.. ఏది ఏమైనా ఇప్పుడు చైనాలో ఉన్న ప్రతి మనిషి బ్రతుకు చాలా దారుణాతి దారుణంగా ఉందనడానికి ఇదొక ఉదాహరణా..

మరింత సమాచారం తెలుసుకోండి: