2012 లో, దేశ రాజధాని ఢిల్లీలో అర్ధ రాత్రి ఒక ఆడ కూతురిని దారుణంగా అత్యాచారం చేసి, అత్యంత పాశవికంగా హత్య చేసారు. ఆరు మృగాలు ఆమెపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత వారికి కోర్ట్ 2013 లో ఉరి శిక్షను ఖరారు చేసింది. కొన్నాళ్ళు ఒక దోషి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకడు మైనర్ కావడంతో జైలు నుంచి విడుదలై బయట ఉన్నాడు. ఇంకా మరో నలుగురు నిందితులు ఇప్పుడు ఉరి శిక్ష కోసం సిద్దంగా ఉన్నారు. కోర్ట్ లు అన్నీ కూడా వాళ్ళను ఉరి తీయాలని స్పష్టంగా చెప్పాయి. 

 

కాని మన చట్టాలు మాత్రం వాళ్లకు క్షమాభిక్షలు ప్రసాదిస్తున్నాయి. ఒకడి తర్వాత ఒకడు ఉరి క్షమాభిక్ష పెట్టుకుంటూ, ఆ కోర్ట్ కి ఒకసారి ఈ కోర్ట్ కి ఒకసారి, రాష్ట్రపతి దగ్గరకి అంటూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు రెండు సార్లు డెత్ వారెంట్ జారీ చేసినా సరే ఉరి శిక్ష ను వాయిదా వేస్తూ వస్తున్నారు. అసలు ఎప్పుడు అమలు చేస్తారో కూడా స్పష్టత రాని తరుణంలో పాటియాలా కోర్ట్ మరోసారి డెత్ వారెంట్ ఇచ్చి వారిని చనిపోయే వరకు ఉరి తీయాలని, ఇంకా ఆలస్యం అయితే బాధితుల హక్కుని అపవిత్రం చేసినట్టు అవుతుంది అని వ్యాఖ్యానించింది. 

 

అయితే నిందితులకు మాత్రం ఇంకా చట్ట పరంగా ఉండే అవకాశాలు పూర్తి కాలేదు. ముకేష్ సింగ్ అనే వాడికి మాత్రమే అన్ని దారులు మూసుకుపోయాయి. మిగిలిన ముగ్గురికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దీనితో అసలు ఉరి శిక్ష అమలు సాధ్యమా కాదా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి కూడా ఉరి శిక్ష మళ్ళీ వాయిదా పడితే గనుక, నిర్భయను చట్టాలు రేప్ చేసినట్టే అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలువస్తున్నాయి. రేప్ చేసిన వాడికి లేని ఇబ్బంది ఆమెకు వచ్చిందని, ఇలాంటి చట్టాల వలన న్యాయం ఎప్పటికి జరగదని అంటున్నారు పలువురు.

మరింత సమాచారం తెలుసుకోండి: